ముద్రగడ లేఖ… ఇండస్ట్రీలో కొత్త టెన్షన్ స్టార్ట్!

-

సీనియర్ రాజకీయ నాయకుడిగా, కాపు ఉద్యమనేతగా పరిచయం ఉన్న ముద్రగడ పద్మనాభం.. ఒకప్పుడు సినీ ఎగ్జిబిటర్ కూడా! అయితే తనకున్న అనుభవంతో రాసారో లేక ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించే పనిలో భాగంగా రాసారో తెలియదు కానీ…  తాజాగా ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు ముద్రగడ. ప్రస్తుతం ఏపీలో ఈ లేఖ హాట్ టాపిక్ గా మారింది.

mudragada padmanabham

ముద్రగడ లేఖ రాశారంటే.. అది రాజకీయంగా సంబంధించిందే అయ్యుంటుందనుకుంటే పొరపాటే! ప్రస్తుతం ఆయన రాసిన లేఖ… సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాల గురించి! అవును… బ్లాక్ మనీని నియంత్రించాలంటే సినిమా టిక్కెట్లు ప్రభుత్వం అమ్మడం మాత్రమే కాదని… హీరో హీరోయిన్లతో పాటు ఇతర నటులు టెక్నీషియన్లకు ఇచ్చే పారితోషకాలను కూడా ప్రభుత్వం ద్వారానే ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు ముద్రగడ!

ఇది నిజంగా సంచలనమైన ఆలోచన అనే చెప్పాలి. ఎందుకంటే… సినిమా ఇండస్ట్రీలో నటీనటులకు ఇచ్చే పారితోషకాలపై ట్రాన్స్పరెన్సీ ఉండటం లేదని చాలా మంది చెప్పే మాటే! అధికారికంగా 10కోట్లు చెప్పినా… అనధికారికంగా 50కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే స్టార్లు టాలీవుడ్ లో ఉన్నారు! దీంతో…  ముద్రగడ చెప్పిన అంశం దీనికి పూర్తిగా ముడిపడి ఉందనే అనుకోవాలి. ఫలితంగా… సినీపరిశ్రమలో రెమ్యునరేషన్ రూపంలో పెరిగిపోతున్న బ్లాక్ మనీని ముద్రగడ ప్రస్తావించారన్నమాట!

దీనివల్ల… స్టార్లు తీసుకునే రెమ్యునరేషన్లో ట్రాన్స్ పరెన్సీ రావడంతోపాటు… పన్నులు ఎగ్గొట్టడం కూడా తగ్గిపోతోందనేది ముద్రగడ ఆలోచనగా ఉంది. అలాగే… పారితోషికం ఇచ్చే విషయంలో నిర్మాతలకు చాలావరకు భారం తగ్గిపోవడంతోపాటు.. సినీమా నిర్మాణంలో దుబారా ఖర్చులు కూడా తగ్గిపోతాయని ముద్రగడ సూచిస్తున్నారు. ఏదిఏమైనా… ముద్రగడ లేఖ నిర్మాతలకు ఫుల్ ప్లస్ అయ్యేలా ఉందనేది మాత్రం వాస్తవం!

మరి ఈ లేఖను గనుక ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తే సినీపరిశ్రమ విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న మరో సంచలనం అవ్వుతుందనడంలో సందేహంలేదు.

కాగా… సినిమి టికెట్లను ఆన్ లైన్లో ప్రభుత్వమే అమ్మే విషయాన్ని టీడీపీతో పాటు ఒక వర్గం మీడియా పూర్తిగా వ్యతిరేకించగా… అసలు ఆన్ లైన్లో టికెట్ల అమ్మమని తామే ప్రభుత్వాన్ని రిక్వెస్టు చేసినట్లు సినీపెద్దలు ప్రకటించిన సంగతి తెలిసిందే!

– CH Raja

Read more RELATED
Recommended to you

Latest news