సంచలనం; నిర్భయ తల్లికి ఎమ్మెల్యే సీటు, సిఎంపై పోటీ…!

-

దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే నెల 8 న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్, ఆప్ విజయం కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. తిరిగి తాను అధికారంలోకి రావడం ఖాయమని అరవింద్ కేజ్రివాల్ భావిస్తుండగా, బిజెపి ఆప్ ని ఓడించి తాము అధికారం చేపట్టడం ఖాయమని అంటుంది. అదే విధంగా ఢిల్లీలో ఎక్కువ కాలం అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం తీవ్రంగా శ్రమిస్తుంది.

దీనితో ఇప్పటికే అభ్యర్ధులను దాదాపుగా అన్ని పార్టీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పుడు ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నిర్భయ తల్లి ఆశాదేవి పోటీ చేస్తారని.. ఏకంగా సీఎం కేజ్రీవాల్‌పైనే ఆమె పోటీకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆఫర్ చేసిందనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో,

కాంగ్రెస్ కీలక నేత కీర్తి ఆజాద్ స్పందించారు. ”అమ్మా నీకు వందనం.. ఆశా దేవి గారు మీకు స్వాగతం అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనితో ఇప్పుడు వార్త ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. దీనిపై ఆశా దేవి స్పందించారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని.. కాంగ్రెస్ పార్టీలో ఎవరితోనూ తాను మాట్లాడలేదని, దోషులకు ఉరిశిక్ష వేసి తన కూతురికి న్యాయం చేయాలని.. అంతకు మించి తనకు ఏమీ వద్దని ఆమె స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news