టీడీపీ ఛీప్ ట్రిక్కుల‌ను న‌మ్మ‌వ‌ద్దు : ఎమ్మెల్యే అంబ‌టి

ఆంధ్రప్ర‌దేశ్ లో సీఎం జ‌గ‌న్ పై దుష్ప్రాచారం చేయ‌డానికి టీడీపీ ఛీప్ ట్రిక్కుల‌ను ప్లే చేస్తుంద‌ని ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి జ‌రుగుతుంటే.. టీడీపీ సం|హించ‌లేక‌పోతుంద‌ని మండిప‌డ్డారు. టీడీపీ ఛీప్ ట్రిక్కుల‌ను ప్ర‌జ‌లేవ‌రు న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. రాష్ట్రంలో పెన్ష‌న్ ను రూ. 2,500 పెంచితే చంద్ర‌బాబు ఏడుస్తున్నార‌ని అన్నారు. అలాగే క్యాసినో విష‌యంలో నిజ నిర్ధార‌ణ క‌మిటీ పేరుతో టీడీపీ డ్రామాలాడుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ డ్రామాల‌న్ని నాని పై కక్ష‌తోనే చేస్తున్నార‌ని ఆరోపించారు.

ప్ర‌తి రోజూ రామోజీ ఫిల్మ్ సిటీలో బెల్లీ డ్యాన్స్ లు జ‌రుగుతుంటే.. టీడీపీ నాయ‌కులు ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. రామోజీ రావు గుడివాడ ద‌గ్గ‌రే ఉంటారు కదా.. ఇప్పటి వ‌ర‌కు ఎందుకు స్పందించ‌లేద‌ని అన్నారు. కొడాలి నాని పై కక్ష ఉంటే.. ఎన్నిక‌ల్లో తెల్చుకోవాల‌ని అన్నారు. కాని ఇలా వ్య‌క్తిగ‌త దాడి చేయ‌కూడ‌ద‌ని అన్నారు. అలాగే ప్ర‌భుత్వ ఉద్యోగులు వాడే భాష స‌రైంది కాద‌ని అన్నారు. ఉద్యోగుల‌కు న్యాయం చేసే బాధ్య‌త ప్ర‌భుత్వానికి ఉంద‌ని అన్నారు. ప్ర‌స్తుత ఆర్థిక ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని పీఆర్సీపీ ప్ర‌క‌టించామ‌ని తెలిపారు. ఏదైనా స‌మ‌స్య ఉంటే త‌మ దృష్టి కి తీసుకురావాల‌ని అన్నారు.