కరోనా కంటే పెద్ద వైరస్ లా తయారైన సాటి మనిషి ?

-

ప్రపంచంలో ప్రతిచోటా ప్రతి మనిషి నోటా నుండి వస్తున్న పదం కరోనా వైరస్. ఈ వైరస్ వల్ల మనిషి జీవన విధానం ఒక్కసారిగా మారిపోయింది. ఒకానొక సమయంలో మనుషులతో ఆప్యాయంగా చేతులు కలిపి మాట్లాడే పరిస్థితి ఉండేది. ఈ వైరస్ రాకతో ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. సొంత ఇంటి వారితో కూడా ఆప్యాయంగా చేతులు కలిపి మాట్లాడే పరిస్థితి ప్రస్తుతం లేదు. ప్రమాదకరమైన ఈ వైరస్ వల్ల మనిషిలో రోజురోజుకీ భయం పెరిగిపోతూ ఉంది. ప్రాణ భయంతో చాలామంది అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎవరైనా తుమ్మినా, దగ్గినా మరియు జ్వరంగా అనిపించిన వెంటనే కరోనా సోకినట్లు నిర్ధారణకు వచ్చేస్తున్నారు. దీంతో చాలా వరకు పక్కన ఉన్న వాళ్ళు ప్రాణభయంతో పక్కకు వెళ్ళిపోతున్నారు.Taunted Over Coronavirus Spread Despite Testing Negative, Himachal ...కూరగాయలు మరియు పాల ప్యాకెట్లు కొనాలి అని అనిపించిన సదరు దుకాణదారుడు కి కరోనా వైరస్ ఉందేమో అన్న భయం మనుషుల్లో నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి లక్షణాలు కలిగిన వారిని సామాజికంగా మనుషులు వారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇటువంటి తరహాలో ఒక సంఘటన ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో ఒక వ్యక్తికి కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు కలిగి ఉండటంతో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు అతని సామాజికంగా ఊరు నుండి వెలి వేశారు. దీంతో అతను ఆ అవమానం భరించలేక తీవ్ర మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నా జిల్లాలోని బంగర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

 

ఆ గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు తేలడంతో వెంటనే వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించారు. అయితే రిపోర్టులో నెగిటివ్ అని వచ్చింది.మళ్లీ గ్రామంలోకి వదిలేశారు. కానీ గ్రామంలో ఉన్న ప్రజలు అతన్ని అనుమతించకుండా ఊరు నుండి వెలి వేశారు. దీంతో ఈ భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత పరిస్థితులు బట్టి మొత్తంగా చూసుకుంటే కరోనా వైరస్ దెబ్బకి…దానికంటే పెద్ద వైరస్ లాగా మనిషి చాలా ప్రమాదకరంగా మారిపోయాడు.  కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు వైద్యం చేసే డాక్టర్లు కూడా ఇటువంటి పరిస్థితిని ప్రస్తుతం చాలా చోట్ల ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఉంటున్న చుట్టుప్రక్కల ప్రాంతాల వారు వెంటనే ఖాళీ చేయాలని ఈ ప్రాంతంలో ఉండకూడదని వైద్యులకు వార్నింగ్ లు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం.

Read more RELATED
Recommended to you

Latest news