విశాఖపట్టణంలో టమాటా ధరలు మోత మోగిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు చాలా తక్కువగానే ఉండింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం, పంట దిగుబడి రాకపోవడంతో టమోటాల ధరలు ఆకాశాన్ని అంటాయి. కేవలం ఒక్క విశాఖపట్టణం మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో అదే పరిస్థితి నెలకొంది. కొన్ని పట్టణాల్లోనే ధరలు తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ లో 50 నుంచి 60 వరకు ఉంటే.. పల్లెటూర్లలో రూ.100 వరకు పలకడం విశేషం.
ఇక విశాఖలో సెంచరీకి చేరువలో టమాటా ధర ఉంది. నిన్నటి నుంచి రైతు బజారుల్లో సబ్సిడీ పై టమాటా విక్రయం చేస్తున్నారు. రైతు బజారులకు టమాటాల కోసం క్యూ లు కట్టారు ప్రజలు. కేవలం ఒక్క కుటుంబానికి రెండు కేజీలా చొప్పున అమ్ముతున్నారు. వారికి మళ్లీ ఆధార్ కార్డు ఉంటేనే టమాటా విక్రయిస్తున్నారు. విశాఖకు 20 టన్నుల టమాటా చేరుకుంది. బయట మార్కెట్ లలో కేజీ రూ.80 నుండి 100 వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. విశాఖతో పాటు హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో ఉల్లిగడ్డ, టమోటాలు ఆధార్ కార్డులతో సబ్సీడీ పై రైతుబజార్లలో విక్రయించడం విశేషం.