చీరాలలో టెన్షన్… టెన్షన్, ఏం జరుగుతోంది, భారీగా పోలీసులు…!

చీరాల నియోజకవర్గంలో మరోసారి అధికార పార్టీలో విభేదాల దెబ్బకు పోలీసులు అప్రమత్తం అయ్యారు. చీరాలలో మరోసారి టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. భారీగా మోహరించిన పోలీసు బలగాలు… ఏ అల్లర్లు చెలరేగకుండా ఉండటానికి చర్యలు తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి, ప్రస్తుత ఎమ్మెల్యే కరణం వర్గీయుల మధ్య ఘర్షణలు జరుగుతాయనే నేపథ్యంలో ఆందోళన నెలకొంది.

ప్రజా సంకల్ప యాత్రకు మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా చీరాలలో కరణం వెంకటేష్, ఆమంచి కృష్ణమోహన్ ల పాదయాత్ర చేయనున్నారు. ఆమంచి, కరణం వర్గాలు ఆధ్వర్యంలో పాదయాత్రలు చేస్తున్నారు. రెండు వర్గాలకు విడివిడిగా రూట్లు కేటాయించారు. దేశాయిపేట నుండి చీరాల గడియార స్తంభం సెంటర్ వరకు ఆమంచి పాదయాత్ర చేయగా… చీరాల గడియార స్తంభం సెంటర్ నుండి ఈపూరుపాలెం వరకు పాదయాత్రలో కరణం వెంకటేష్ పాల్గొంటారు. పాదయాత్రలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసారు.