ఓవర్ కాంఫిడెన్స్: ౭౮ ఇన్ ది సర్వేస్..కెసిఆర్ ఐస్ ది లోటస్ ఇన్ ది రూట్..!

-

ఉమ్మడి అనంతపురం వైసీపీలో చిచ్చు చెలరేగింది..ఎక్కడకక్కడ వైసీపీలో ఆధిపత్య పోరు పెరిగిపోయింది. ఎమ్మెల్యేలు వర్సెస్ అసమ్మతి వర్గం అన్నట్లు రచ్చ నడుస్తోంది. ఈ పరిస్తితిని చక్కదిద్దేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతలో ఎంట్రీ ఇచ్చారు..ఇక ఆయన సమస్యలు పరిష్కరిస్తున్నారో లేదో తెలియదు గాని..అక్కడకు వెళ్ళి చంద్రబాబు కుప్పంలో ఓడిపోవడం ఖాయమని, కళ్యాణదుర్గంలో పోటీ చేస్తే అక్కడ కూడా ఓడిస్తామని మాట్లాడుతున్నారు.

ఓ వైపు వైసీపీలో అసమ్మతి పోరు చెలరేగిపోతుంది. మొదట కళ్యాణదుర్గంలో పార్టీని సరిచేసే కార్యక్రమం చేపట్టారు. అక్కడ మంత్రి ఉషశ్రీచరణ్‌కు వ్యతిరేకంగా కొందరు వైసీపీ శ్రేణులు గళం విప్పారు. మళ్ళీ ఆమెకు సీటు ఇస్తే గెలవడం కష్టమని కామెంట్లు వినిపించాయి. ఆ తర్వాత ఉరవకొండ వెళ్ళగా, అక్కడ ఇంచార్జ్ గా ఉన్న విశ్వేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన సొంత సోదరుడు మధుసూదన్ రెడ్డి ఫైర్ అయ్యారు. విశ్వేశ్వర్ రెడ్డి వల్లే పార్టీ నాశనం అయిందని, ఆయనకు సీటు ఇస్తే వైసీపీ గెలవదని పెద్దిరెడ్డి సమక్షంలోనే అన్నారు. దీంతో పెద్దిరెడ్డి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

ఆ తర్వాత మడకశిర వెళ్ళగా…అక్కడ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై సొంత పార్టీ వాళ్లే ఫైర్ అయ్యారు. తిప్పేస్వామి డబ్బు మనిషి అని, అవినీతి చక్రవర్తి అని విరుచుకుపడ్డారు. ఇప్పుడు పెద్దిరెడ్డి పెనుకొండలో సమీక్షా సమావేశం పెట్టారు. అక్కడ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు వ్యతిరేకంగా వైసీపీలోని ఓ వర్గం నిరసన తెలియజేసింది. పెద్దిరెడ్డి కాన్వాయ్‌కు అడ్డంగా కూర్చున్నారు..అలాగే కాన్వాయ్ వైపు చెప్పులు చూపించారు.

కాన్వాయ్ దిగక ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడానికి వ్యతిరేక వర్గం ప్రయత్నించింది..కానీ ఓ క్రమంలో సహనం కోల్పోయిన మంత్రి… కార్యకర్తలను దూరంగా నెట్టేశారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యే వర్గం కూడా వచ్చి నినాదాలు చేసింది. ఇలా పెనుకొండ నియోజక వర్గ వైసీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం ‘జగనన్న ముద్దు.. శంకర్ నారాయణ వద్దు’ అంటూ నినాదాలు చేసింది. మరో వర్గం ‘ధర్మవరం నాయకత్వం వద్దు… పెనుకొండ నాయకత్వం ముద్దు’ అంటూ నినాదాలతో హోరెత్తించింది. మాజీ మంత్రి శంకర నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్ వాహనంపై ఆ వర్గం వారు చెప్పులు విసిరారు. మొత్తానికి అనంత వైసీపీలో పెద్ద రచ్చ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news