పల్నాడు మళ్ళీ వైసీపీదే..!

-

పల్నాడు గడ్డ పోరాటాల పూర్తి గడ్డ…వైసీపీ అడ్డా..అందులో ఎలాంటి డౌట్ లేదు. పల్నాడు జిల్లాలో రాజకీయంగా వైసీపీదే ఆధిక్యం. గత ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది..ఈ సారి ఎన్నికల్లో కూడా వైసీపీ జోరు కొనసాగనుంది. పల్నాడులో ప్రధానంగా కమ్మ, రెడ్డి వర్గాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. అయితే రెడ్డి వర్గం ఎలాగో వైసీపీకి ఫుల్ సపోర్ట్..కానీ గత ఎన్నికల్లో కమ్మ వర్గం సగం వైసీపీకే సపోర్ట్ చేసింది..దీంతో టి‌డి‌పి కమ్మ నేతలకు చెక్ పడిపోయింది.

ఈ సారి కూడా అదే పరిస్తితి కనిపిస్తుంది. ఇప్పటికీ పల్నాడులో వైసీపీదే హవా. పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మాచర్ల, నరసారావుపేట, పెదకూరపాడు, వినుకొండ, చిలకలూరిపేట, గురజాల, సత్తెనపల్లి సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో 7కి 7 సీట్లు వైసీపీ గెలుచుకుంది. మాచర్ల, నరసారావుపేట, గురజాలలో రెడ్డి వర్గం నేతలు గెలవగా, పెదకూరపాడు, వినుకొండలో కమ్మ వర్గం నేతలు గెలిచారు. చిలకలూరిపేటలో బి‌సి, సత్తెనపల్లిలో కాపు వర్గం నేత గెలిచారు. అంటే అన్నీ వర్గాలు వైసీపీకి మద్ధతు ఇచ్చాయి.

ఈ సారి ఎన్నికల్లో కూడా పల్నాడులో వైసీపీ హవా కొనసాగే ఛాన్స్ ఉంది. కాకపోతే స్వీప్ చేయడం కాస్త కష్టం. ఎందుకంటే ఇక్కడ టి‌డి‌పి నేతలు బలపడుతున్నారు. ఇటు లోకేష్ పాదయాత్ర ప్రభావం కాస్త ఉండే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతం వైసీపీకి లీడింగ్ ఉన్న సీట్లు..మాచర్ల, నరసరావుపేట, గురజాల..ఇటు చిలకలూరిపేటలొ హోరాహోరీ పోరు జరిగే ఛాన్స్ ఉంది.

అటు సత్తెనపల్లిలో టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీకి రిస్క్.  పెదకూరపాడులో కూడా హోరాహోరీ పోటు ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే పల్నాడులో మళ్ళీ వైసీపీ పై చేయి సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news