పల్నాడులో భారీ ట్విస్ట్‌లు: అటు-ఇటు జంపింగులు.!

-

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో చెప్పలేని పరిస్తితి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు రావచ్చు..లేదా ముందస్తు అయిన రావచ్చు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ నేతలు..మంచి మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లే ప్రధాన టార్గెట్. ఇక ఒక పార్టీలో సీటు దక్కకపోయినా. లేదా అక్కడ ప్రాధాన్యత లేకపోయినా, అధికారం దక్కడం కష్టమని డౌట్ వచ్చిన నేతలు జంప్ అవ్వడానికి రెడీ అవుతున్నారు.

ఇదే క్రమంలో పల్నాడు జిల్లాలో భారీ ట్విస్ట్‌లు చోటు చేసుకునేలా ఉన్నాయని తెలుస్తుంది. ఇక్కడ అటు-ఇటు జంపింగులు నడిచేలా ఉన్నాయి. అంటే టి‌డి‌పి నేతలు వైసీపీలోకి..వైసీపీ నేతలు టి‌డి‌పిలోకి జంప్ చేసేలా ఉన్నారు. ఇందులో మొదట టి‌డి‌పి సీనియర్, నరసారావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు..వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం వస్తుంది. ఈయన తన కుమారుడుకు గాని, కుమార్తెకు గాని సత్తెనపల్లి లేదా గుంటూరు వెస్ట్ సీటు ఆశిస్తున్నారు.

కానీ సత్తెనపల్లిలో ఇటీవలే కన్నా లక్ష్మీనారాయణని పెట్టారు. అసలు కన్నాతో రాయపాటికి పడదు. ఇటు గుంటూరు వెస్ట్ డౌటే. దీంతో రాయపాటి వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని తెలిసింది. అయితే సత్తెనపల్లి సీటు కోసం రాయపాటి పట్టు పట్టినట్లు తెలిసింది. సీటు దక్కితే ఆయన జంప్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఇటు నరసారావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టి‌డి‌పి వైపు చూస్తున్నారని కథనాలు వస్తున్నాయి. ఈయనకు మంత్రి విడదల రజిని వర్గంతో పడదు. ఇటీవలే చైతన్య విద్యాసంస్థల అధినేత బి‌ఎస్ రావు చనిపోతే అక్కడకు నివాళులు అర్పించడానికి వచ్చిన లోకేష్ తో లావు కాసేపు మాట్లాడినట్లు తెలిసింది. దీంతో లావు జంప్ అవుతారని ప్రచారం వస్తుంది. ఇవే నిజమైతే అటు-ఇటు జంపింగులు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news