తెలంగాణలో అధికార బిఆర్‌ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. ఎవరు అవునన్న ..కాదన్న సొంత పార్టీ నేతలకే పడటం లేదు.చాలా చోట్ల సీట్ల విషయంలో పంచాయితీ నడుస్తోంది. ఈ పంచాయితీలతోనే పార్టీకి నష్టం జరుగుతుంది. కొందరేమో పార్టీ మారిపోతున్నారు. ఇదే క్రమంలో బిఆర్‌ఎస్ కు పట్టున పరకాల నియోజకవర్గంలో అదే రచ్చ నడుస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి..తెలంగాణ రైతు రుణ విమోచన ఛైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు మధ్య పోరు నడుస్తుంది.
అయితే నాగుర్ల తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పనిచేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్నారు. కానీ 2014లో పరకాల నుంచి టిడిపి తరుపున గెలిచిన చల్లా..ఆ తర్వాత బిఆర్‌ఎస్ లోకి వచ్చారు. దీంతో ఆయన హవా మొదలైంది. ఇక 2018 ఎన్నికల్లో కూడా ఆయన టికెట్ దక్కించుకుని గెలిచారు. ఇక ఇప్పుడు ఆయనపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగానే కనిపిస్తుంది. సొంత పార్టీ వాళ్లే యాంటీగా ఉన్నారు. ఈ పరిస్తితుల్లో మళ్ళీ ఆయనకు సీటు ఇవ్వాలని బిఆర్‌ఎస్ అధిష్టానం ఆలోచిస్తుందని తెలిసింది. దీంతో నాగుర్ల వర్గం ఆగ్రహంగా ఉంది.
ఎలాగైనా సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ చల్లాకే సీటు ఇస్తే నాగుర్ల వర్గం ఎంత వరకు సహకరిస్తుందో చెప్పలేని పరిస్తితి. ఎలాగో నాగుర్ల వర్గం కూడా పరకాలలో బలంగానే ఉంది. దీని వల్ల చల్లాకు చిక్కులు వచ్చేలా ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ లో కొండా సురేఖ ఫ్యామిలీకి బెనిఫిట్ అయ్యేలా ఉంది.
ఈ సారి ఇక్కడ కాంగ్రెస్ నుంచి కొండా మురళీ గాని ఆయన కుమార్తె సుస్మితా పటేల్ గాని పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక బిఆర్‌ఎస్ లో ఉన్న అంతర్గత పోరు కొండా ఫ్యామిలీకి కలిసొచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు.