ధరణి పోర్టల్ తెలంగాణ మహమ్మారిగా తయారైందని మండిపడ్డారు భట్టి విక్రమార్క. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 1440 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం మధ్యాహ్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి అమరవీరులకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పాదయాత్రకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన పై అవగాహన కల్పించేందుకే పాదయాత్ర చేసినట్లు వెల్లడించారు భట్టి. ఇక కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అందరూ కోరుకుంటున్నారని.. ధరణి పోర్టల్ పేరుతో మా భూములు మాకు కాకుండా చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారని విమర్శించారు.