బీజేపీ తో కలిస్తే పవన్ కి ఇంత నష్టమా – వామ్మో ఊహకందని దెబ్బ ఇది !

ఒక స్టార్ హోటల్లో జనసేన పార్టీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ మరొక స్టార్ హోటల్లో అదే జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయటానికి రెడీ అవటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను అధికారం నాకు అవసరం లేదు అంటూ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు తో కలసి అడుగులు వేసిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీ నేతలతో కలసి రెండు చోట్ల ఎమ్మెల్యే గా నిలబడి చిత్తుచిత్తుగా ఓడిపోయాడు.

ఇటువంటి తరుణంలో ముందు నుండి వైయస్ జగన్ ని బలమైన ప్రత్యర్థిగా టార్గెట్ గా చేసుకుని అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్…బిజెపి పార్టీ తో కలిసి నడిస్తే గాని జగన్ లాంటి నాయకుడిని ఎదురుకో లేము అన్నట్టుగా ప్రస్తుతం జనసేన పార్టీ.. బీజేపీ పార్టీతో కలసి పని చేయడానికి మంతనాలు చేస్తున్న తరుణంలో చాలామంది రాజకీయ మేధావులు పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి భవిష్యత్తు రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా ఆయన పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయిపోయినట్లే పవన్ కళ్యాణ్ కి ఊహించని నష్టం మరియు రాజకీయ దెబ్బ తగలడం గ్యారెంటీ అని అంటున్నారు. ముఖ్యంగా ముందు నుండి పవన్ కళ్యాణ్ ని దళితులు ముస్లింలు ఎక్కువగా అభిమానిస్తూ ఉండటంతో పైగా జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే దళితుడు కావడం తో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ కి దళితులు మరియు ముస్లింలు కూడా దూరం అవ్వటం గ్యారెంటీ అని అంటున్నారు. 

 

అంతేకాకుండా ఒక స్టార్ సెలబ్రిటీ కలిగిన పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ని బీజేపీ పార్టీ లీడర్లు పెద్దగా పట్టించుకోరు అని దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు బిజెపి పార్టీ కార్యకర్తల మధ్య ఖచ్చితంగా మనస్పర్ధలు రావటం గ్యారెంటీ అని భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ కలిసి అడుగులు వేసే రోజులు చాలా తక్కువగానే ఉంటాయి అంటూ రాజకీయ మేధావులు జోస్యం చెబుతున్నారు.