రేపు మ‌ళ్లీ ఢిల్లీకి వెళ్ల‌నున్న ప‌వ‌న్ క‌ళ్యాన్‌.. అందుకేనా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు మ‌ళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. అక్క‌డ రేపు ఉదయం కేంద్రయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శిస్తారు. అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రకటించిన కోటి రూపాయల చెక్కును అందజేస్తారు. ఇటీవల ‘ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే’ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ రూ.కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక బోర్డుకు ఈ విరాళం అందజేయనున్నట్లు ఆయన ట్విటర్‌ ద్వారా ఇటీవల తెలిపారు. ఈ మేరకు ఆ చెక్‌ను ఇవ్వనున్నారు.

మధ్యామ్నం 3 గంటలకు విజ్ఞాన్ భవన్ లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. దేశానికి యువ నాయకత్వం అవసరం గురించి విద్యార్థులతో మాట్లాడతారు. అంతేకాకుండా, అక్క‌డ విద్యార్థులు అడిగే ప్రశ్నలకు కూడా ప‌వ‌న్ సమాధానమిస్తారు. అలాగే ఈ సదస్సులో పవన్ కళ్యాణ్ గురించి రూపొందించిన షార్ట్ ఫిలీంను టెలికాస్ట్ చేస్తారు. మేఘాలయ శాసన సభ స్పీకర్ మెత్బా లింగ్డో అధ్యక్షత వహిస్తున్న ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొననున్నారు.