వైసీపీలో వారసుడు ఎంట్రీ..టీడీపీ హ్యాపీ?

-

రాజకీయాల్లో సీనియర్ నేతల వారసుల ఎంట్రీ సహజంగానే జరుగుతుంది….ఏ సీనియర్ నాయకుడైన తమ వారసుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి సక్సెస్ చేయాలని అనుకుంటారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వారసులు ఎంట్రీ ఇచ్చారు..సక్సెస్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ వారసుడుగా కేటీఆర్ రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. ఇటు వైఎస్సార్ వారసుడు జగన్ ఇప్పుడు సీఎంగా ఉన్నారు. అలాగే చంద్రబాబు వారసుడు నారా లోకేష్ సైతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. అలాగే ఇంకా చాలామంది వారసులు రాజకీయాల్లో ఉన్నారు..అలాగే వచ్చే ఎన్నికల్లో ఇంకా కొంతమంది వారసులు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

ఇదే క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని వారసుడు పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) సైతం వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం(బందరు) అసెంబ్లీలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కిట్టు బందరులో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. మొన్నటివరకు పేర్ని మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో పనులు కిట్టునే చూసుకున్నారు. ఇప్పుడు కూడా కిట్టు తనదైన శైలిలో పనులు చేసుకుంటూ ముందుకెళుతున్నారు.

అయితే సీనియర్ నేతగా ఉన్న పేర్ని వచ్చే ఎన్నికల్లో రెస్ట్ తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తన తనయుడు కిట్టుని బందరు అసెంబ్లీలో పోటీ చేయించాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆ విషయం మాజీ మంత్రి కొడాలినాని బయటపెట్టేసారు. ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో…నెక్స్ట్ ఎన్నికల్లో బందరులో పేర్ని నాని వారసుడు కిట్టు పోటీ చేస్తారని ప్రకటించారు.  దీంతో నెక్స్ట్ బందరు బరిలో కిట్టు ఉండటం ఫిక్స్.

అటు టీడీపీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోటీ చేస్తారు. ఓడిపోయిన దగ్గర నుంచి కొల్లు దూకుడుగా పనిచేస్తున్నారు. బందరులో చాలా వరకు పికప్ అయ్యారు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పేర్ని కాకుండా ఆయన వారసుడు పోటీ చేయడం కొల్లుకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే రాజకీయంగా పేర్ని వ్యూహాలు వేరు..శత్రువులని సైతం కలుపుకునే మనస్తత్వం…కానీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కిట్టుకు దూకుడు ఎక్కువని తెలుస్తోంది…అలాగే అందరిని కలుపుకుని పోతారా లేదా? అనేది డౌట్. నెక్స్ట్ సీటు కిట్టుకు ఇస్తే బందరులో వైసీపీ గెలవడం కష్టమని సొంత పార్టీ వాళ్లే మాట్లాడుకుంటున్నారు. అలాగే కిట్టు బరిలో ఉంటే తమకే మంచిదని టీడీపీ నేతలు హ్యాపీగా చెబుతున్నారు. అలాగే తమ నేత కొల్లు విజయం ఇంకా సులువు అవుతుందని అంటున్నారు. మొత్తానికి పేర్ని వారసుడు ఎంట్రీ వల్ల బందరు టీడీపీలో జోష్ పెరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version