బీ టౌన్ లో మొదటి ఫిలింఫేర్ అవార్డు అందుకున్న తెలుగు నటి..!!

-

దక్షిణాది సెలబ్రిటీలు.. ఉత్తరాది సినిమాలలో నటించడంలో ఈ తరం ముందేమి కాదు. అప్పట్లో కూడా చాలామంది హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపును కూడా సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా మన తెలుగు నటీమణులు హిందీ పరిశ్రమలలో ఎన్నో చిత్రాలలో నటించి ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్న వారు కూడా ఉండడం గమనార్హం. ఇకపోతే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కడ సినిమాలలో నటించి, ఆ సినిమాలకు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న మొట్టమొదటి తెలుగు నటి ఎవరో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి లక్ష్మి. తన నటనతో అందంతో , అమాయకపు చూపులతో కొన్ని వేల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న ఈమె కళాకారుల కుటుంబంలో మూడవ తరం కళాకారిణి గా పుట్టింది. ఇక ఈమె తండ్రి వైవి రావు. నెల్లూరు జిల్లాకు చెందిన నటుడు అలాగే దర్శకుడు కూడా. ఇక ఈమె తల్లి రుక్మిణి. తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ నటీ మణి గా గుర్తింపు తెచ్చుకుంది. డిసెంబర్ 13 1952లో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో మద్రాస్ లో జన్మించిన లక్ష్మి .. 1974లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా 1975లో ఈమె నటించి విజయవంతమైన హిందీ చిత్రం జూలీలో ప్రధాన పాత్ర పోషించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

హీరోయిన్ గా అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. 15వ ఏటనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మొదటి రోజుల్లో అద్భుతమైన నటన కనబరుస్తూ.. అందరి ప్రశంసలు అందుకుంది. ఇక ఈమె తెలుగులో ఎక్కువగా అమ్మమ్మ పాత్రలు పోషించారు. మిధునం, జీన్స్, ఓ బేబీ, నిన్నే పెళ్లాడుతా , మురారి వంటి సినిమాలలో అమ్మ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇప్పటికీ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న లక్ష్మికి అంతే స్థాయిలో అభిమానులు ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version