చిరంజీవికి బీజేపి చీఫ్ ఫోన్…?

Join Our Community
follow manalokam on social media

తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేయవచ్చు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే చిరంజీవి ప్రచారం చేయడానికి ఆసక్తిగా లేరని అర్థమవుతుంది. అయితే ఇప్పుడు చిరంజీవి ప్రచారానికి రావాలి అంటూ బీజేపీ అగ్రనేతలు కోరుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు చిరంజీవికి ఫోన్ చేసి ప్రచారం చేయవలసిందిగా కోరినట్టుగా వార్తలు వస్తున్నాయి.

త్వరలోనే ప్రచారానికి చిరంజీవి వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ అక్కడ సమర్థవంతంగా ప్రచారం చేయలేకపోవచ్చు. అయితే చిరంజీవి ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా తమకు పడే అవకాశం ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే చిరంజీవి అక్కడ ప్రచారం చేయాలని కోరుతున్నట్లుగా సమాచారం. గత ఏడాది కాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై చిరంజీవి అలాగే మెగా ఫ్యామిలీ లో ఉన్న కొంతమంది పదేపదే ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని దగ్గర చేసుకోవడానికి తీవ్రస్థాయిలో కష్ట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ బిజెపి అభ్యర్థికి చిరంజీవి ప్రచారం చేస్తే మంచి మార్కులు కూడా పడే అవకాశం ఉంటుంది. అయితే జనసేన పార్టీ తిరుపతిలో ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు ప్రచార కమిటీలను కూడా ప్రకటించలేదు. దీనితో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రచారం చేయాలా లేదా అనే సందిగ్ధంలో ఉండిపోయారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...