డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ పత్రాల గడువు పెంపు..!

-

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా మోటార్ వాహన పత్రాలైన డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ), ఇతర అనుమతుల చెల్లుబాటును 2021 జూన్ 30వ తేదీ వరకు పొడగించినట్లు శుక్రవారం ప్రకటన జారీ చేసింది. వాహనానికి సంబంధించిన పత్రాల గడువు ముగుస్తున్నా.. అవి జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపింది.

driving-license
driving-license

2020 ఫిబ్రవరి 1వ తేదీకి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ పత్రాల రెన్యూవలేషన్ గడువు ముగిసిన పత్రాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారి కోసం కేంద్రం తీపి కబురును అందించింది. 20 జూన్ 2021 నాటికి వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలు చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతర డాక్యూమెంట్లు ఉన్నాయి. మోటారు వాహన చట్టం-1988, మోటారు నిబంధన చట్టం-1989 ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానంతో వాహనదారులకు కొంత మేర ఉపశమనం లభిస్తుందని రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ పత్రాల గడువు ముగిసినా.. జూన్ 20వ తేదీ వరకు చెల్లుబాటు కల్పిస్తున్నామని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు డ్రైవింగ్ లైసెన్స్ అనుమతించడానికి కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుందన్నారు. ఆర్టీవో కార్యాలయాల్లో నిర్వహించే అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడం జరుగుతుందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో 69 శాతం ఉత్తీర్ణత సాధించాలి. రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా ఈ నైపుణ్య పరీక్షలను కఠినతరం చేయనున్నట్లు మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news