మోదీ దృష్టంతా కోటీశ్వరులైన స్నేహితులపైనే: ప్రియాంకా గాంధీ

Join Our Community
follow manalokam on social media

దేశ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టంతా కేవలం కోటీశ్వరులైన తన స్నేహితుల అభివృద్ధి పైనే ఉంటుందని దేశ ప్రజల క్షేమం గురించి అంతగా పట్టించుకోరని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. అందుకే నూతన చట్టాలను ఉపసంహరించుకోవాలంటున్న రైతుల డిమాండ్‌ను అంగీకరించడం లేదని ఆమె పేర్కొన్నారు. దేశ సరిహద్దుల్లో కాపాల కాస్తున్న సైనికులు కూడా రైతుల కోడుకులేనని ప్రధాని గుర్తించుకోకపోవడం విడ్డూరమన్నారు. ముజాఫర్‌లో జరిగిన ‘కిసాన్‌ మహా పంచాయత్‌’ ఆమె పాల్గోని ప్రసంగించారు.

అహంకారి రాజు పాత్రలా..

పురాన కథల్లో ఉండే అహంకారి రాజు పాత్ర వంటి వ్యక్తి ప్రధాని అని.. తన పాలన విస్తరించడంతో రాజ మందిరానికే పరిమితమయ్యే రాజులా వ్యవహరిస్తున్నారని ప్రియాంకా ఎద్దేవా చేశారు. కొత్త సాగు చట్టాలతో రైతుల హక్కులు హరించుకుపోయి వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని, కనీస మద్దతు ధరలు, మండీలు అంతరించిపోతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రోజురోజుకు డీజిల్‌. పెట్రోల్, గ్యాస్‌ ధరలను పెంచడంతో పెడుతున్న శ్రద్ధ రైతులు పండించే చెరుకు ధరను పెంచడంలో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.

రూ. 3.5 లక్షల కోట్ల ఏమయ్యాయి..?

గతేడాది డీజిల్‌ విధించిన పన్నుతో ప్రభుత్వానికి రూ. 3.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని.. ఆ డబ్బంతా ఎవరి ఖాతాలో జమా చేశారో చూపాలన్నారు. దేశ ప్రజలకు అన్నం పెట్టేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నా రైతన్నలకు ఆ సొమ్ము ఎందుకు చేరడం లేదన్నారు. దేశ విదేశాలకు పరుగులు పెడుతున్న ప్రధాని, తన నివాసానికి ఐదారు కిలోమీటర్ల దూరంలోనే ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న రైతుల వైపు కన్నెతి చూడకపోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

TOP STORIES

చెప్పినట్టుగానే బీహార్ లో ఫ్రీ కరోనా వ్యాక్సిన్…!

బీహార్ ప్రభుత్వం ఫ్రీగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ని అందిస్తోంది. బీహార్ స్టేట్ లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వాక్సిన్ ఫ్రీ గా వేయడానికి...