టీడీపీ మాజీ మంత్రికి చుక్కలు, మరో కేసు పెట్టిన పోలీసులు…!

-

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఆయనపై మరో కేసు నమోదు చేసారు పోలీసులు. బెయిల్‌పై వచ్చి 12 గంటలు కూడా గడవక ముందే ఆయనపై మరో కేసు నమోదు చేసారు పోలీసులు. ఆయన సోమవారం తన నియోజకవర్గ కేంద్రమైన నర్సీపట్నంలో ర్యాలీగా వెళ్లి పీఎస్‌లో బెయిల్ పత్రాలు సమర్పి౦చి,

తిరిగి వస్తూ, ర్యాలీ ముగింపులో కోడిపందాల నిర్వహణపై రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు రావడమే కాకుండా, ఆయన అనుమతి లేకుండా ర్యాలీ, రోడ్‌షో నిర్వహించడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు పోలీసులు 504 ఐపీసీ, 189, 188, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల వైసీపీలో చేరిన తన సోదరుడు సన్యాసి పాత్రుడు గత నెల 12 న తన ఇంటిపై వైసీపీ జెండా కట్టేందుకు ప్రయత్నాలు చేయగా, కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు.

దీనితో తనకు అయ్యన్న కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని సన్యాసి పాత్రుడు కుమారుడు వరుణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కౌంటర్‌గా వరుణ్‌పైనా కేసు పెట్టారు. దీనితో పోలీసులు అయ్యన్న ఇంటి దగ్గర మోహరించారు. దీనిపై అయ్యన్న పోలీసులపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు పోలీసుల్ని దూషించి, విదులకు ఆటంకం కలిగించారని అయ్యన్నపై 353, 506, 504, 500 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటి నుంచి అయ్యన్న కనిపించకుండా పోయారు. తర్వాత ఆయన ముందస్తు బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నెల 3న అయ్యన్నకు బెయిల్‌ మంజూరు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news