అనంతపురం టిడిపిలో అసమ్మతి సెగలు కక్కుతోంది.. తాము చెప్పిన అభ్యర్థిని ప్రకటించాలంటూ చంద్రబాబుకి క్యాడర్ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతుంది.. అధిష్టానం పిలిపించి బుజ్జగించినా.. స్థానిక నేతలు డోంట్ కేర్ అంటున్నారట.. దీంతో అసమ్మతి నేతలను బుజ్జగించడం చంద్రబాబు నాయుడుకు తలనొప్పిగా మారిందని పార్టీలో చర్చ నడుస్తోంది..
అనంతపురం టిడిపిలో మొదటి నుంచి ఆధిపత్యం పోరు అధిష్టానానికి తలనొప్పిగా ఉండేది.. అభ్యర్థులను ప్రకటించిన తరువాత పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ఏకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జోక్యం చేసుకున్నా.. అసమ్మతినేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట.. అభ్యర్థుల ప్రకటన తర్వాత చంద్రబాబు తొలిసారి జిల్లాకు వచ్చారు.. ఆ సమయంలోనే టిడిపి శ్రేణులు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారట.
పరిస్థితిని గమనించిన చంద్రబాబు కొందరు నేతలను పిలిపించి మాట్లాడిన వారు సెట్ రైట్ కాలేదట.. మరికొందరు నేతలు అయితే ఏకంగా చంద్రబాబు టూర్ కే డుమ్మా కొట్టారని.. అనంతపురంలో టిడిపికి గడ్డుకాలం స్టార్ట్ అయింది అంటూ సొంత పార్టీ నేతల నుంచే గుసగుసలు వినిపిస్తున్నాయి.. అధిష్టానం మీద అసంతృప్తితో ఉమామహేశ్వర నాయుడు కార్యకర్తలతో చర్చిస్తున్నారట.. సింగనమల నియోజకవర్గం లో శ్రావణి కి టికెట్ ఇవ్వడంతో ఆగ్రహంతో ఉన్న కేశవరెడ్డి.. ఆమెకు సహకరించే ప్రసక్తే లేదని.. అవసరమైతే ఆమె ఓటమికి పనిచేస్తానని ప్రకటిస్తున్నారు.
ఈ వ్యవహారం చంద్రబాబు నాయుడుకు తలనొప్పిగా మారిందట.. మడకశిర నియోజకవర్గంలో కూడా పార్టీ పరిస్థితి దారుణంగా దిగజారుతోందని.. ఈరన్న కొడుకు సునీల్ కు టిక్కెట్ ఇవ్వడంతో తిప్పేస్వామి వర్గం బల ప్రదర్శనకు సిద్ధమైందట.. సునీల్ కు వ్యతిరేకంగా తిప్పేస్వామి వర్గం ర్యాలీ నిర్వహించగా.. అందులో ఓ కార్యకర్త సునీల్ కు టికెట్ ఇవ్వొద్దంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు.. ఇలా ప్రతి నియోజకవర్గంలో అసమ్మతి నేతలు బల ప్రదర్శనకు దిగుతూ పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తున్నారట. ఈ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు అనంతపురంలో టిడిపికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు..