నియోజకవర్గ అభివృద్ది కోసం రాజకీయ ప్రత్యర్దులు పోటీ.. ఎవరో మీరే చూడండి.

-

వారిద్దరూ రాజకీయ ప్రత్యర్దులు.. ఒకే పార్టీలో ఉండటంతో కలిసి అభివృద్ది చేస్తారని అందరూ భావించారు.. కానీ వారు తమ ఆదిపత్యం కోసం అభివృద్ది మంత్రాన్ని జపిస్తున్నారు.. పంతాలకు భవిష్యత్ ఉండదని గ్రహించిన ఆ ఇద్దరూ.. నియోజకవర్గాన్ని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు.. దీంతో జగిత్యాల నియోజకవర్గంలో క్రెడిట్ పైట్ నడుస్తోంది.. ఇంతకీ ఆ కథేంటో చూద్దామా..?

 

జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ ఇటీవల కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నారు.. దీంతో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు.. ప్రభుత్వ పెద్దల జోక్యంతో వెనక్కి తగ్గినా.. ఇద్దరు ప్రత్యర్దులు ఒకే పార్టీలో ఉండటంతో ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గానే ఉంది.. ఈ క్రమంలో నియోజకవర్గంపై తమ ముద్ర వేసుకునేందుకు నేతలిద్దరూ ప్రయత్నాలు చేస్తున్నారట.. స్వంత ఇలాకాలు ఆదిపత్యం కోసం అభివృద్ది మంత్రాన్ని జపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.. నూకపల్లి కేంద్రంగా ఇద్దరూ తమ వ్యూహాలకు పదును పెట్టారని టాక్ వినిపిస్తోంది..

నూకపల్లిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే సంజయ్.. ఇటీవల సీఎం రేవంత్ ను మంత్రులను కలిశారు.. దీంతో జీవన్ రెడ్డి కూడా దూకుడు పెంచారు.. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్దికి 100 కోట్ల కేటాయించడంతో పాటు.. నూకపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు ఇచ్చేందుకు సహకరించాలని ఆయన కూడా ప్రభుత్వ పెద్దలను కలిశారట.. దీంతో నూకపల్లి కేంద్రంగా ఇద్దరూ క్రెడిట్ కోసం పైట్ స్టాట్ చేశారని ప్రచారం నడుస్తోంది.. రాజకీయ ఆదిపత్యం కోసం పైట్ చేస్తే ప్యూచర్ ఉండదని గ్రహించిన ఆ ఇద్దరు నేతలు.. నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు అభివృద్ది మంత్రాన్ని ఆలపిస్తున్నారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news