కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ… పార్టీని వీడిన ప్రియాంకా

-

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తాకింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. ఆమె సడెన్ గా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో గుండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆమె కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే వారిని పార్టీ పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. దీంతో మనస్తాపం చెందిన ప్రియాంక పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.తన ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి టాగ్ ను కూడా ఆమె తీసేశారు. అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు.



దీంతో ఆ వివాదం మళ్లీ ప్రారంభమయింది. వాళ్లపై సస్పెన్షన్ ను ఎత్తివేయడంతో మనస్తాపం చెందిన ప్రియాంక పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.కొన్ని రోజుల కింద మధురలో జరిగిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు స్థానిక నాయకులు ప్రియాంకపై అభ్యంతరకరంగా ప్రవర్తించారట. ఈ విషయాన్ని ప్రియాంక పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో పార్టీ స్థానిక కాంగ్రెస్ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే… తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా వారిపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తేశారు.

priyanka resigned to congress party

Read more RELATED
Recommended to you

Latest news