ఏపీ సర్కారే డేటా చోరీకి పాల్పడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ శ్రీధర్

-

ఓ సమస్యపై నేను 1100 కు ఫోన్ చేశా. దీంతో వాళ్లు ముందు నా ఆధార్ నెంబర్ అడిగారు. తర్వాత నా ఆధార్ నెంబర్ తో రిజిస్టర్ అయి ఉన్న చిరునామాను వాళ్లు చెప్పారు. ప్రస్తుతం నేను ఉండే అడ్రస్ లు అడిగి తెలుసుకున్నారు.

ఏపీ సర్కారే ఓటర్ల డేటాను చోరీ చేసింది. 1100 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పిన వారి డేటాను సేకరించి.. సేవామిత్ర యాప్ కు ఇచ్చారు. ఇదంతా ఏపీ సర్కారు స్కెచ్చే.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నేషనల్, ఇంటర్నేషనల్ విజిటింగ్ ప్రొఫెసర్ శ్రీధర్ వెల్లడించారు. ఈ సవాల్ ను ఏపీ ప్రభుత్వం స్వీకరిస్తే.. 72 గంటల్లో దీన్ని నిరూపిస్తానని ఆయన మీడియాకు తెలిపారు.

ఓ సమస్యపై నేను 1100 కు ఫోన్ చేశా. దీంతో వాళ్లు ముందు నా ఆధార్ నెంబర్ అడిగారు. తర్వాత నా ఆధార్ నెంబర్ తో రిజిస్టర్ అయి ఉన్న చిరునామాను వాళ్లు చెప్పారు. ప్రస్తుతం నేను ఉండే అడ్రస్ లు అడిగి తెలుసుకున్నారు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇలా 1100 కు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరి నుంచి డేటా తీసుకొని … ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ల డేటాను మాత్రం సేవామిత్ర యాప్ కు అప్పగించారని ఆయన స్పష్టం చేశారు.

వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన 23 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఓట్ల తొలగింపు చేసినట్లు ఆయన తెలిపారు. అందులో కూడా ఎక్కువగా వైసీపీ సానుభూతిపరుల ఓట్లనే తొలగించారన్నారు. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశేనని ఆయన స్పష్టం చేశారు. సేవామిత్రాలో ఏపీ ప్రజల డేటా ఉందని రుజువు చేయడం చాలా సులభమని ఆయన వెల్లడించారు. ఇంకా తన వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని త్వరలోనే మరిన్ని విషయాలు మీడియాకు వెల్లడిస్తానని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version