కారు నేతలు కనబడట్లేదే.. ఓటు అడిగితే ఒట్టు!

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో వెనుకబడింది. ఇప్పటికే అక్కడ గులాబీ పార్టీకి అంత సానుకూలత లేదు. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే కి మద్దతుగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారానికి రావడం లేదు. నియోజకవర్గ పరిధిలో ఉన్న కౌన్సిలర్లు జనం ముందుకు వెళ్ళడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇంతకాలం అధికారం లో ఉన్నా సరే ప్రజలకు అభివృద్ధి పనులు చేసి పెట్టడంలో విఫలమయ్యారు.

brs party
brs party

దీంతో కారు కౌన్సిలర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీని గెలిపించాలని ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడగలేకపోతున్నారు. ఇప్పటికే ఎన్నికల సమయం దగ్గర పడింది.అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు. కుత్బుల్లాపూర్ లో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ప్రచారం లో దూసుకెళ్తున్నారు. ప్రతి ఓటరుని కలుస్తున్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధి ని వివరిస్తున్నారు. ప్రజలు కూడా కూనకు అనుకూలం గా ఉన్నారు.

అటు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రచారానికి సొంత నాయకుల మద్దతు కరువైంది. సొంత కౌన్సిలర్లు ప్రచారానికి రాకుండా మొహం చాటేస్తున్నారు. వారు జనంలో తిరగపోవడానికి కారణాలు ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో పేద, మధ్య తరగతి ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పి మాట తప్పారు.

పైగా ఇందిరా గాంధీ సమయంలో పేదలకు భూములు ఇస్తే వాటిని తీసుకుని ఇళ్లు కట్టిస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చారు. భూములకు పరిహారం ఇవ్వలేదు.. అటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వలేదు. అలాగే దళితబంధు, కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు ఇలా పలు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందలేదు.

దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు. ఈ క్రమంలో కారు కౌన్సిలర్లు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు..ఓటు అడగలేకపోతున్నారు. ఇక గతంలో ఎమ్మెల్యే గా అండగా నిలిచిన కూన శ్రీశైలం గౌడ్ వైపు కుత్బుల్లాపూర్ ప్రజలు చూస్తున్నారు. ఆయనకు గెలుపు అవకాశాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇంకా రిజల్ట్ రావడమే నెక్స్ట్ .