ఈట‌ల చేరిక‌పై రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వాళ్లను టార్గెట్ చేశాడా?

-

ఎన్నో మ‌లుపుల త‌ర్వాత అంద‌రూ అనుకున్న‌ట్టుగానే ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం ఎట్ట‌కేల‌కు క్లైమాక్స్‌కు వ‌చ్చింది. ముందుగా ఊహించిన విధంగానే ఈ రోజు ఆయ‌న త‌న పార్టీ ప‌ద‌వికి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి తిరుగుబాటు జెండా ఎగరేశారు. షామీర్‌పేటలోని తన నివాసంలో ఆయ‌న మీడియా సమావేశం నిర్వ‌హించి, అనేక విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఇక ఆయ‌న బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు.

అయితే ఈట‌ల బీజేపీలో చేరిక‌పై ఎమ్మెల్యే రాజీసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అన్ని పార్టీలో ఉన్నట్లే బీజేపీలో కూడా గ్రూపులు ఉన్నాయని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు బీజేపీలో చోటులేదని వెల్ల‌డించారు.

ఇత‌ర పార్టీల నేత‌ల చేరికలను వ్యతిరేకిస్తే వాళ్లకే నష్టమని రాజాసింగ్ ప‌రోక్షంగా బీజేపీ అసంతృప్తుల‌ను టార్గెట్ చేశారు. ఈటల బీజేపీలోకివస్తే పార్టీలో ఉన్న కొంతమంది వీడతారనే వార్తలు వచ్చాయని, కానీ పార్టీ ఎవ‌రి మీద ఆధార‌ప‌డ‌ద‌ని వెల్ల‌డించారు. ఈటల పార్టీలోకి వస్తే బీజేపీ బ‌ల‌ప‌డుతుంద‌ని, ఈట‌ల బీసీలో బ‌ల‌మైన నేత‌గా ఉన్నార‌ని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి పార్టీలోకి వస్తే బాగుంటుందని రాజాసింగ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. అయితే రాజాసింగ్ ఇన్‌డైరెక్టుగా పెద్దిరెడ్డి, ఇత‌ర సంజ‌య్ ముఖ్య అనుచ‌రుల‌ను టార్గెట్ చేసి మాట్లాడిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే సంజ‌య్‌కు చెక్ పెట్టేందుకు ఈట‌ల‌ను తీసుకొస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో రాజాసింగ్ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news