రాజస్థాన్ రాజకీయం… నేడు కొత్తగా 15 మంత్రుల ప్రమాణ స్వీకారం.

-

రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నిన్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మినహా కెబినెట్ లో అందరు మంత్రులు రాజీనామా చేశారు. మంత్రి మండలిని పూర్తిగా పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ హై కమాండ్ మంత్రుల పేర్లపై కసరత్తు చేసింది. నేడు ఢిల్లీ నుంచి మంత్రుల పేర్ల జాబితాను రాజస్థాన్ పంపించనున్నారు. పార్టీలో అసంత్రుప్తిని రూపు మాపేందుకే రాజస్థాన్ కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం గవర్నర్ సమక్షంలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కొత్తగా నేడు 15 మంత్రులు ప్రయాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం 200 మంది శాసన సభలో సభ్యలుగా ఉన్నారు. దీంతో కేబినెట్ లో గరిష్టంగా 30 మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం 15 మందిని మాత్రమే మంత్రులుగా సూచించినట్లు సమాచారం.

ప్రభుత్వంపై ఎప్పటి నుంచో అసంత్రుప్తిగా ఉంటున్న సచిన్ పైలెట్ వర్గం నుంచి కూడా కొంతమందికి మంత్రి వర్గం నుంచి చోటు దక్కనుంది. పైలెట్ వర్గం నుంచి 5 గురికి మంత్రి వర్గంలో స్థానం లభించనుంది. గతంలో సచిన్ పైలెట్ సొంత పార్టీపైనే తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news