రేపు హైద‌రాబాద్ కు రాకేశ్ టికాయ‌త్ ! రైతుల‌ మ‌హా ధ‌ర్నా

సంయుక్త కిసాన్ మోర్చా నే రాకేశ్ టికాయత్ రేపు హైద‌రాబాద్ కు రానున్నాడు. మూడు సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ చేస్తున్న పోరాటం సంవ‌త్స‌రం అవుతున్న త‌రుణం లో తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లో రైతు సంఘాల ఆధ్వ‌ర్యంలో మ‌హా ధ‌ర్నా నిర్వ‌హిస్తున్నారు. ఈ మ‌హా ధ‌ర్నా లో పాల్గొన డానికి రైతు ఉద్య‌మ నేత రాకేశ్ టికాయ‌త్ తో పాటు ఉత్త‌రాది నుంచి అధిక సంఖ్య లో రైతు ఉద్య‌మ నేతలు వ‌స్తున్నారు.

కాగ సాగు చట్టాల ర‌ద్దు ను పార్లమెంటు ఉబ‌య స‌భ‌ల‌లో ఆమోదించాల‌ని అలాగే రైతులు పండించే అన్ని పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌త్తు ధ‌ర క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ ఈ మ‌హా ధ‌ర్నా జ‌ర‌గ‌నుంది. అయితే ప్ర‌స్తుతం తెలంగాణ లో వ‌రి ధాన్యం కొనుగోలు అంశం పై కేంద్రం పై తీవ్ర వ్య‌తిరేకత వ‌స్తుంది. ఇలాంటి స‌మ‌యం లో రైతు ఉద్య‌మ నేత‌లు అంద‌రూ తెలంగాణ కు రావ‌డం బీజేపీ కి శాపం గా మారే అవ‌కాశం ఉంటుంది. అలాగే ఈ రైతు మ‌హా ధ‌ర్నా లో అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొనే అవ‌కాశం ఉంది.