నేడు హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ..

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. తన కుమారుడు రై హాన్ కంటి పరీక్షల కోసం ప్రియాంక గాంధీ హైదరాబాద్ వస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ప్రకటన చేశాయి. కెబిఆర్ పార్కు సమీపంలో ఉన్న… ఎల్ వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి లో .. రైహాన్ కు కంటి చికిత్స చేయించనున్నారు ప్రియాంక.

Priyanka Gandhi
Priyanka Gandhi

ఇవాళ, రేపు హైదరాబాద్ లోనే బస చేయనున్నారు ప్రియాంక గాంధీ. కాగా గత నాలుగు సంవత్సరాల కింద క్రికెట్ ఆడుతుండగా ఆమె కుమారుడి కంటికి గాయం అయింది. మొదట ఢిల్లీ ఎయిమ్స్ కు తీసుకువెళ్లారు. అయితే అక్కడి వైద్యులు సలహాతో.. హైదరాబాదులోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ముగ్గురు వైద్యులతో కూడిన బృందం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందజేశారు. ఈ ట్రీట్మెంట్ లో భాగంగానే ఇవాళ మరోసారి హైదరాబాద్ రానున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  ప్రియాంక గాంధీ.