రామోజీరావు – ఇన్ సెక్యూరిటీ కష్టాలు !

-

ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేస్తూ నిర్ణయం తీసుకుంటూ సుప్రీంకోర్టు న్యాయస్థానం మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణం కేసులో ఆదేశాలు జారీ చేసింది. దీంతో మార్గదర్శి ఫైనాన్షియర్స్ చైర్మన్ గా రామోజీరావును కేసు నుంచి డిశ్చార్జ్ చేయడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో దాఖలు చేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపించింది. ఏంటో ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల న్యూఢిల్లీలో మీడియా ముందు వెల్లడించారు. చట్టం అందరికీ వర్తిస్తుందని చట్టం ముందు అందరూ సమానులే అని ఏదో రకంగా డొంకతిరుగుడు తనంగా రామోజీరావు కేసు నుండి తప్పించుకోవాలని చూస్తున్నారని ఉండవల్లి విమర్శించారు.

Related image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుంభకోణం జరిగితే హైకోర్టు విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు చెరో హైకోర్టు వచ్చిన సందర్భంలో రామోజీరావు తెలివిగా కేవలం ప్రతివాదిగా తెలంగాణ రాష్ట్రాన్నే చేర్చారని తప్పించుకోవాలని చూశారని దీంతో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఉమ్మడి రాష్ట్రంలో ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కుంభకోణం జరగటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తాజాగా సుప్రీం న్యాయస్థానం ప్రతివాదిగా చేర్చిందని ఈ కేసులో రిజర్వుబ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా  రామోజీరావు డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చామన్న క్లైమ్‌లో కూడా చాలా తప్పులు ఉన్నాయి.

 

డిపాజిట్లు వెనక్కి ఇచ్చారా లేదా అనే పరిశీలనను కూడా అడ్డుకుంటున్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చినని చెప్పినంత మాత్రాన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగిపోవు. ఈ కేసుపై ట్రయల్ కోర్టులో నిబంధనల ప్రకారం విచారణ జరగాలి. కేసు రుజువైతే సుమారు 7 వేల కోట్లతో పాటు రెండున్నర ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని ఉండవల్లి ఈ సందర్భంగా తెలిపారు. దీంతో ఈ వార్త ఏపీ లో ఉన్న అన్ని మీడియా చానల్స్ లో హాట్ టాపిక్ గా మారగా ఈనాడులో మాత్రం ఈ వార్తకు సంబంధించి ఎటువంటి వార్తలు రాకపోవడంతో రామోజీరావుకి ఇన్ సెక్యూరిటీ కష్టాలు మొదలయ్యాయి అని కామెంట్ చేస్తున్నారు ఆయన ప్రత్యర్ధులు. 

Read more RELATED
Recommended to you

Latest news