ఎప్పుడూ లేనంతగా ఈసారి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఇప్పటివరకు ఎప్పుడూ ఇంత భారీ శాతం పోలింగ్ నమోదు అవ్వలేదు. ఏపీ మొత్తం ఓటింగ్ ప్రక్రియలో హుషారుగా పాల్గొన్నది.
ఆంధ్ర ప్రదేశ్ అంతా ఓటెత్తింది. ఎంతలా అంటే తెలంగాణలోని హైదరాబాద్ ఖాళీ అయ్యేంతలా? అవును.. సీమాంధ్రుల్లో చాలామంది హైదరాబాద్ లో సెటిల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. సంక్రాంతి పండుగ కంటే కూడా ఎక్కువగా ఎన్నికల్లో ఓటేయడానికి ఆంధ్రులంతా తరలివెళ్లారు. దీంతో హైదరాబాద్ బొసిపోయింది. ఎక్కడ చూసినా ఖాళీ రోడ్లే. ఖాళీ రోడ్లే దర్శనమివ్వడం బట్టే తెలిసిపోయింది జనాలు ఓటేయడానికి ఎలా తరలివెళ్లారో.
ఎప్పుడూ లేనంతగా ఈసారి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఇప్పటివరకు ఎప్పుడూ ఇంత భారీ శాతం పోలింగ్ నమోదు అవ్వలేదు. ఏపీ మొత్తం ఓటింగ్ ప్రక్రియలో హుషారుగా పాల్గొన్నది.
ఎవరికి కలిసి వచ్చేను..
ఇంతకీ ఏపీ ప్రజలు ఎవరికి ఓటేశారు? ఎవరికి పట్టం కట్టారు? అనే విషయం మాత్రం మే 23న తెలియనుంది. కానీ.. ఇప్పటికే గెలుపు మాదంటే మాది అంటూ ఓవైపు టీడీపీ మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు ధీమాతో ఉన్నారు. కానీ.. గెలుపు ఎవరివైపు ఉన్నది అనేది మాత్రం అంచనా వేయడం కష్టం. ఈ ఎన్నికల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్లంతా పసుపు కుంకుమ లబ్ధిదారులా? పసుపు కుంకుమ పేరుతో లబ్ధి పొందుతున్న వాళ్లయితే.. వాళ్లు ఎవరికి ఓటేశారు? మళ్లీ చంద్రబాబును గెలిపించుకొని తమ పసుపు కుంకుమ పథకాన్ని కొనసాగించుకోవాలనుకుంటున్నారా? అనేది చెప్పాలంటా కష్టమే. ఏమో.. ఈసారి జగన్ కు అవకాశం ఇద్దామని మహిళలు అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొని ఉండవచ్చు. మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఓటేశారంటే.. వాళ్లు మార్పు మాత్రం ఖచ్చితంగా కోరుకోవాలని అనుకుంటున్నారు. అది మాత్రం తేటతెల్లమైంది. అయితే.. వాళ్లు ఎటువంటి మార్పు కోరుకోవాలనుకుంటున్నారు. మళ్లీ చంద్రబాబుకే అధికారం ఇచ్చి మార్పు కోరుకోబోతున్నారా? లేక.. చంద్రబాబును ఓడించి… వైఎస్ జగన్ కు చాన్స్ ఇచ్చి కొత్త శకానికి నాంది పలుకుదామనుకుంటున్నరా? తెలియాలంటే మే 23 దాకా మనం వెయిట్ చేయాల్సిందే.