ఏపీలో జగన్ అలెర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. ఇప్పటివరకు తిరుగులేని బలంతో ఉన్న జగన్‌కు వ్యతిరేక పరిస్తితులు ఏర్పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. అది జగన్ వల్ల కాకపోయినా…కొందరు వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు వల్ల ఇబ్బందులు వచ్చే పరిస్తితి కనిపిస్తోంది. ఇక జగన్ బయటకొచ్చి పరిస్తితులని చక్కదిద్దాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాలి.
గత ఎన్నికల ముందు జగన్ నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. తన పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమయ్యారు. అలాగే ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. దీంతో 2019 ఎన్నికల్లో ప్రజలు…వైసీపీ నేత ఎవరు అని పెద్దగా చూడకుండా జగన్ బొమ్మ చూసి వైసీపీకి భారీ మెజారిటీ ఇచ్చేశారు. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యారు. ఇక జగన్ ప్రజారంజక పాలనతో దూసుకెళుతున్నారు. అభివృద్ధి తక్కువైన సంక్షేమ రంగంలో నెంబర్ 1గా ఉన్నారు.
అయితే సీఎంగా జగన్‌కు వచ్చే ఇబ్బంది లేదు…కానీ కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో సీన్ రివర్స్ అయిపోయింది. గత ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లోనూ వైసీపీ హవా నడిచింది. కానీ ఈ రెండున్నర ఏళ్లలో కొన్ని జిల్లాల్లో పరిస్తితి తారుమారైంది. అలా వైసీపీకి సీన్ రివర్స్ అవుతున్న జిల్లాలు వచ్చి..శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.
ఈ జిల్లాల్లో టీడీపీ వేగంగా పుంజుకుంటుంది. అదే సమయంలో ఈ జిల్లాల్లో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఒకవేళ జనసేన గాని టీడీపీతో కలిస్తే ఈ జిల్లాల్లో వైసీపీ హావా పూర్తిగా తగ్గుతుంది. కాబట్టి ఈ జిల్లాపై జగన్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటినుంచి ఫోకస్ పెట్టకపోతే వైసీపీ డేంజర్ జోన్‌లోకి వెళ్ళినట్లే. ఇక విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ ఆధిక్యం ఉంది.