యూపీలో బీజేపీని 45 సీట్లకే పరిమితం చేస్తామంటూ మాజీ మంత్రి సవాల్…

-

బీజేపీ పార్టీని 2017కు ముందుగా ఉన్న 45 సీట్లకే పరిమితం చేస్తామంటూ ఇటీవల బీజేపీకి, మంత్రి మండలికి రాజీనామా చేసిన మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య సవాల్ చేశారు. బీజేపీకి, యోగి ఆదిత్య నాథ్ మంత్రి మండలికి రాజీనామా చేసిన తర్వాత స్వామి ప్రసాద్ మౌర్య, అఖిలేష్ సమక్షంలో సమాజ్ వాదీ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. తాజా అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు స్వామి ప్రసాద్ మౌర్య..తనతో పాటు రాజీనామా చేసిన పలువురు ఎమ్మెల్యేలను అఖిలేష్ యాదవ్ కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో కేవలం 45 సీట్లకే పరిమితం చేస్తామని అన్నారు. 

ఇటీవల ఓబీసీ, దళిత వ్యతిరేఖ విధానాలు అవలంభిస్తున్నారని ఆరోపిస్తూ… స్వామి ప్రసాద్ మౌర్య తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత మరో ఇద్దరు మంత్రులు కూడా రాజీనామా చేశారు. వీరితో పాటు మరో 7 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మరో నెలలో ఎన్నికలు జరుగబోతున్న యూపీలో వరసగా బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news