ఏపీ రాజకీయాలు కులాల ఆధారంగా నడుస్తాయనే సంగతి తెలిసిందే…ప్రధాన పార్టీలు…కులాల వారీగా రాజకీయం చేస్తూ..ఆయా కులాల ఓట్లని సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. అలాగే అసెంబ్లీ సీట్లని సైతం కులాల ఆధారంగానే కేటాయిస్తారు. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ-టీడీపీల నుంచి రెడ్లు పోటీ పడుతుంటారు.
అయితే సాధారణంగా రెడ్ల మద్ధతు వైసీపీకే ఎక్కువ..అందుకే నెల్లూరు, రాయలసీమల్లో ఆ పార్టీ సత్తా చాటుతూ ఉంటుంది. ఇక వైసీపీ హవా తగ్గించేందుకు టీడీపీ సైతం రెడ్లనే బరిలోకి దించుతూ ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ రెడ్లపై టీడీపీ రెడ్లు బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో రెడ్డి వర్సెస్ రెడ్డి ఫైట్ షురూ అయింది.
పుంగనూరులో వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…టీడీపీ నుంచి చల్లా రామచంద్రారెడ్డి పోటీ చేయనున్నారు. పీలేరులో చింతల రామచంద్రారెడ్డి వర్సెస్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.. శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి వర్సెస్ బొజ్జల సుధీర్ రెడ్డి… సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి వర్సెస్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. తాడిపత్రిలో పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి… డోన్ లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వర్సెస్ ధర్మవరం సుబ్బారెడ్డి.. శ్రీశైలంలో శిల్పా చక్రపాణిరెడ్డి వర్సెస్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి..నంద్యాలలో శిల్పా రవిచంద్ర రెడ్డి వర్సెస్ భూమా బ్రహ్మానందరెడ్డి… ఆళ్లగడ్డలో బిజేంద్రనాథ్ రెడ్డి వర్సెస్ అఖిలప్రియ.. పాణ్యంలో కాటసాని రామ్ భూపాల్ రెడ్డి వర్సెస్ గౌరు చరితారెడ్డి పోటీ చేయనున్నారు.
ఇక బనగానపల్లెలో కాటసాని రామిరెడ్డి వర్సెస్ బీసీ జనార్ధన్ రెడ్డి.. ఎమ్మిగనూరులో చెన్నకేశవ రెడ్డి వర్సెస్ జయనాగేశ్వర్ రెడ్డి… అలాగే కడప జిల్లాలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ-టీడీపీల నుంచి రెడ్డి నేతలే పోటీ పడనున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ రెడ్లు పూర్తిగా పైచేయి సాధించారు. టీడీపీ తరుపున ఒక్క రెడ్డి నేత కూడా గెలవలేదు. మరి వచ్చే ఎన్నికల్లో ఏ రెడ్డి నేత పైచేయి సాధిస్తారో చూడాలి.