దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. లోకల్ బాడీ ఎన్నికలే లక్ష్యంగా కీలక నిర్ణయం..

-

లోకల్ బాడీ ఎన్నికలే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చెయ్యడంతో పాటు.. కులగణనను చేపట్టేందుకు ఆయన సిద్దమయ్యారు.. రెండు నెలల్లో డోర్ టు డోర్ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, విద్య, రాజకీయ, కుల.. ఆ అంశాలన్నింటిపైన సమగ్రంగా కులగణన చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు..

కులాలవారీగా సర్వే చేయించి.. వారికి అందాల్సిన సంక్షేమ పథకాలమీద ప్రభుత్వం ఓ క్లారిటీ తీసుకోబోతుంది.. దాంతో పాటు.. బీసీ డిక్లరేషన్ పై కూడా ప్రభుత్వం నిర్లయం సీరియస్ గా ఉందట.. ఎన్నికల సమయంలో ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.. ముందుగా కులగణన పూర్తి చేసే బాద్యతను ప్రణాళిక సంఘానికి అప్పజెప్పింది. రానున్న రెండు నెలల్లో దీన్ని పూర్తి స్థాయిలో చేసేందుకు ప్రణాళిక సంఘం సిద్దమవుతోంది.. ఇందుకోసం రాష్ట్ర ప్రణాళిక సంఘం ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో కులగణన చేసేందుకు ఎలాంటి కసరత్తు చేయాలి, ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి.. అనే దానిపై ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనుంది.

ప్రణాళికా సంఘం నిర్వహించే కీలక సమావేశం తర్వాత దీనిపై ఓ స్పష్టత రాబోతుందని తెలుస్తోంది..
ఏయే జిల్లాల్లో ఏయే తేదీల్లో సర్వే చేయాలి, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అనేదానిపై స్పష్టత రానుంది. ప్రధానంగా ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల.. ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా సజావుగా నిర్వహించేందుకు అధికారులను సిద్దం చేస్తోంది ప్రభుత్వం..

సమయం తక్కువగా ఉండటంతో.. కులగణన పూర్తి చేసి..ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ వ్యవహారాన్ని క్యాష్ చేసుకోవాలని బీఆర్ఎస్ తో పాటు.. బిజేపీ కూడా ప్రయత్నం చేస్తుంది.. బీసీ ఉద్యమ నేత కిష్ణయ్య కూడా దీనిపై ఆందోళనలకు పిలుపునిస్తున్నారు.. బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.. ఈ క్రమంలో కులగణన పూర్తి చేయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news