శోభమ్మ సెంటిమెంట్ కేసీఆర్‌కు వర్కౌట్ అవుతుందా?

-

రాజకీయాల్లో కుటుంబ సభ్యుల గురించి నాయకులు పెద్దగా ప్రస్తావించారు. కుటుంబాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం అరుదుగా జరుగుతుంది. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం, తన భార్య శోభమ్మ పేరుని ఎక్కువగా తీసుకురారు. ఉండటానికి ఫ్యామిలీ మొత్తం రాజకీయాల్లోనే ఉంది గానీ, శోభమ్మ విషయం మాత్రం ఎక్కువగా ప్రస్తావించారు.

cm kcr | సీఎం కేసీఆర్

కానీ కేసీఆర్ తనదైన శైలిలో మాట్లాడుతూ…ప్రజలని ఆకట్టుకోవడంలో భాగంగా ఒకో సందర్భంలో ఆమె పేరుని తీసుకొస్తారు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమం చేయాలని తన భార్యని అడిగానని, ఆమె కూడా రాష్ట్రం కోసం పోరాడమని చెప్పారని అని కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాజాగా హుజూరాబాద్‌లో దళితబంధు పథకం అమలు సందర్భంగా, దీనిపై కూడా తన భార్యని ఒక మాట అడిగినట్లు, ఆమె కూడా దళితులకు న్యాయం జరగట్లేదని, దీని ద్వారా న్యాయం జరుగుతుందని తనకు చెప్పినట్లు హుజూరాబాద్ సభలో చెప్పారు.

అయితే శోభమ్మ పేరుని సభలో తీసుకురావడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. తన మొహం చెల్లక.. దళిత బంధు సభకు వంద మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు, అధికార యంత్రాగాన్నీ కేసీఆర్‌ వెంట తీసుకెళ్లారని, ఇది చాలక ప్రసంగంలో ఆయన భార్య శోభమ్మ పేరునూ తీసుకొచ్చారని, ఒక్క అసెంబ్లీ స్థానంలో గెలవడానికి ఇంత నీచానికి దిగజారిన కేసీఆర్‌ను చూస్తుంటే జాలి కలుగుతోందని రేవంత్ మాట్లాడారు.

అంటే ఇక్కడ రాజకీయ నాయకులు తమ ఇంట్లో విషయాలని తీసుకొచ్చి సామాన్య ప్రజలకు చెబుతూ, కాస్త సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు హుజూరాబాద్‌లో కేసీఆర్ సైతం, తన భార్య పేరుని ప్రస్తావిస్తూ, అక్కడి ప్రజల్లో సెంటిమెంట్ తీసుకొచ్చి, ఉపఎన్నికలో లబ్ది పొందటానికి కేసీఆర్ చూశారని, ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని రేవంత్ చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version