తెలంగాణా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి భూ కబ్జా వివాదంలో చిక్కుకున్నారు. తప్పుడు పత్రాలతో ఆయన భూముల కొన్నారు అనే ఆరోపణల మీద అధికారులు విచారణ జరుపుతున్నారు. గోసన్ పల్లి లో ఆయన కబ్జాలు చేసారని అధికార పార్టీ ఆరోపిస్తుంది. ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి.
ఇది పక్కన పెడితే రేవంత్ రెడ్డి ని ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం సస్పెండ్ చేసే యోచనలో ఉందని అంటున్నారు. రాష్ట్రంలో కీలక నేతలు కొందరు ఆయనపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. రేవంత్ వ్యాపారాల కోసం ఆలోచించే మనిషి అని ఆయన వలన పార్టీలో వర్గ విభేదాలు మొదలయ్యాయి అనే ఫిర్యాదులు అధిష్టానం వద్దకు వెళ్లినట్టు సమాచారం. అదే విధంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాల మీద ఇప్పటికే అధిష్టానం అసహనంగా ఉంది.
ఇప్పటికే ఈ పదవి కోసం పార్టీలో చాలా మంది సీనియర్లు పోటీ పడుతున్నారు. వారు పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు. అగ్ర నేతలుగా తెలంగాణా కాంగ్రెస్ ని ముందుకి నడిపించారు. అయినా సరే రేవంత్ రెడ్డి మాత్రం తనకు పదవులు కావాలని చేస్తున్న ఒత్తిడి చికాకుగా మారింది. రేవంత్ రెడ్డి పార్టీలోకి వచ్చిన కొత్తలో… ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు.
ఇప్పుడు మళ్ళీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పక్క భూ కబ్జా ఆరోపణలతో ఆయన రేవంత్ రెడ్డి అభాసుపాలు అవుతున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన పదవి కోసం ప్రయత్నాలు చేయడం, సీనియర్లకు పదవి వద్దని చెప్పడం, తనకు ఇవ్వాలని అధిష్టానానికి నివేదికలు ఇవ్వడంపై ఇప్పుడు కాంగ్రెస్ అగ్ర నేతలు కూడా అసహనంగా ఉన్నారు. దీనితో ఆయన్ను సస్పెండ్ చేయడం ఖాయమని అంటున్నారు.