జగన్‌కు పాజిటివ్ వేవ్ ఉందా.. మూడు నెల‌ల పాల‌న ఎలా ఉంది…?  

-

నేను విన్నాను…నేను ఉన్నాను…అనే నినాదంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావొస్తోంది. అయితే ఏ ప్రభుత్వానికైనా ప్రారంభంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కానీ నేతలకు ఉన్న అనుభవంతో వాటిని పరిష్కరించుకుంటూ వస్తారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రారంభంలో ఇబ్బందులు పడుతూనే పాలన మొదలుపెట్టింది. పైగా జగన్ కు పాలన వ్యవహారాల్లో అనుభవం లేకపోవడం, అపోజిట్ రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండటం వలన వైసీపీ ప్రభుత్వం కొంచెం ఇబ్బందులు పడింది. దాని వలన ప్రజల్లో కూడా కొంత నెగిటివ్ వచ్చింది.

కానీ జగన్ తీసుకున్న నిర్ణయాలు మొదట్లో ప్రజలకు అర్ధం కాకపోయినా..ఇప్పుడు నిదానంగా మంచి ఫలితాలని ఇస్తున్నాయి. అందులో మొదటిగా జగన్ అధికారంలోకి రాగానే లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చారు. దీన్ని పెద్దగా ఎవరు నమ్మలేదు. కానీ వారి నమ్మకాలని వమ్ము చేస్తూ….గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల పేరిట లక్షల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు. గతంలో ఏ ప్రభుత్వం ఇంత స్థాయిలో ఉద్యోగాలు కల్పన చేయలేదని చెప్పాలి. దీనిపై టీడీపీ విమర్శలు చేసినా…ప్రజల్లో మాత్రం మంచి స్పందన వస్తోంది.

అటు గత టీడీపీ ప్రభుత్వం పలు ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడిందని చెబుతూ…పోలవరం సహ…కొన్ని ప్రాజెక్టుల పనులు ఆపేసి…జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ, బీజేపీ, కేంద్ర పెద్దలు విమర్శలు చేశారు. దీని వల్ల ప్రాజెక్టు పనులు ఆలస్యమైపోతాయని మాట్లాడారు. కానీ వారి మాట లెక్క చేయకుండా రివర్స్ టెండరింగ్ కి వెళ్ళి…గతం కంటే తక్కువ ధరకే టెండర్లు వచ్చేలా చేసి…పోలవరంలో వందల కోట్లు మిగిల్చేలా చేశారు. అటు ఇసుక విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తాజాగా అందులో కూడా కీలక నిర్ణయం తీసుకుని…ఎక్కడ అవినీతి జరగకుండా, తక్కువ ధరకే ఇసుక లభ్యమయ్యేలా ప్రణాళికలు రూపొందించి ప్రజలకు అందేలా చేస్తున్నారు.

ఇలా మొదట్లో జగన్ తీసుకున్న నిర్ణయాలు వల్ల కొంచె వ్యతిరేకిత వచ్చిన తర్వాత మాత్రం అవి సత్ఫలితాలని ఇస్తున్నాయి. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జగన్ ప్రభుత్వం సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో సంక్షేమ క్యాలండర్ పక్కాగా అమలు చేయడానికి యాక్షన్ ప్లాన్ తో సిధ్ధంగా ఉన్నారు. మొత్తం మీద జగన్ ప్రభుత్వం నిదానంగా ప్రజలకు దగ్గరవుతుందనే చెప్పాలి.జగన్‌

Read more RELATED
Recommended to you

Exit mobile version