కేసీఆర్ సొంత ఊరు నుంచి రేవంత్ పాదయాత్ర…?

-

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పాదయాత్రకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. అయితే ఆయన ఎక్కడి నుంచి పాదయాత్ర మొదలు పెడతారు ఏంటి అనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఎటువంటి స్పష్టత కూడా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు అందరూ కూడా ఈ పాదయాత్రను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనను పాదయాత్ర చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీనితో రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ముహూర్తాన్ని ఖరారు చేసుకునే పనిలో పడ్డారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పాదయాత్ర సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా ఆయన ఇప్పటికే ఒక సమాచారాన్ని పంపించారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.

రేవంత్ రెడ్డి పాదయాత్ర అక్కడి నుంచి మొదలు పెట్టి సిద్దిపేట సిరిసిల్ల సహా ఖమ్మం జిల్లా అశ్వరావుపేట వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జగిత్యాల నుంచి కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టొచ్చు అనే ప్రచారం కూడా ఉంది. వాస్తవానికి జగిత్యాల నుంచి ఏదైనా ఉద్యమం మొదలు పెడితే అది కచ్చితంగా విజయవంతం అవుతుంది. తెలంగాణ ఉద్యమం గాని అలాగే వామపక్షాలు మొదలుపెట్టిన ఉద్యమాలు గాని జగిత్యాల నుంచి గతంలో మొదలు పెట్టిన పరిస్థితి.

Read more RELATED
Recommended to you

Latest news