వైసీపీలో వర్మ పాలిటిక్స్: డైవర్షన్ గేమ్ ఆడుతున్నారా?

-

ఇటీవల ఏపీ రాజకీయాల్లో సినిమా టిక్కెట్ల అంశం బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ధరలు తగ్గించాల్సినవి చాలా ఉన్నాయి…అయినా సరే పేద వాడు సినిమా చూడాలని చెప్పి సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించమని వైసీపీ మంత్రులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇసుక, పెట్రోల్, డీజిల్, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు ఇలా అనేక వాటిపై ధరలు తగ్గించాలి. కానీ అవేమీ జగన్ ప్రభుత్వం పట్టించుకోకుండా సినిమా టిక్కెట్లపైనే పడింది…దీంతో అందరికీ డౌట్ వస్తుంది. ఇది అసలు కావాలనే చేస్తున్నట్లు కనిపిస్తుందని కోణంలో ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి.

పైగా సినిమా టిక్కెట్ల అంశంపై ఎవరైనా సినిమా వాళ్ళు మాట్లాడితే వారిపై వైసీపీ నేతలు విరుచుకుపడిపోతున్నారు. ఇక ఇటీవల మంత్రి పేర్ని నాని, డైరక్టర్ రామ్ గోపాల్ వర్మల మధ్య పెద్ద ఫైట్ నడుస్తోంది. మామూలుగా జగన్‌ని అభిమానించే వర్మ ఈ సినిమా టిక్కెట్ల అంశాన్ని భుజానికి ఎత్తుకోవడంపై టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. ఎప్పుడు ఏదొక కాంట్రవర్సీలో ఉండే వర్మ…బాధ్యతగా టిక్కెట్ల అంశంపై మాట్లాడటం ఏంటని డౌట్ పడుతున్నారు.

అయితే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఓ వైపు ఉద్యోగుల పి‌ఆర్‌సి విషయంలో రగడ జరుగుతుంది. మరో వైపు గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు తమని పర్మినెంట్ చేయాలని ఆందోళనలు చేస్తున్నారు. నిరుద్యోగుల అంశం అలాగే ఉంది…ఇంకా ధరలు పెరుగుదలపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు తక్కువ.

ఇలా రాష్ట్రంలో చాలా అంశాలు ఉన్నాయి. కానీ కేవలం సినిమా టిక్కెట్ల అంశాన్నే ఎక్కువ హైలైట్ అయ్యేలా చేస్తున్నారు. అందులోనూ వర్మ లాంటి వారు జోక్యం చేసుకోవడంతో పరిస్తితి వేరుగా ఉంది. టోటల్‌గా టిక్కెట్ల చుట్టూనే రాజకీయం నడుస్తోంది. మిగిలిన సమస్యలు పక్కకు వెళ్లిపోయాయి. కేవలం మిగిలిన సమస్యలని డైవర్ట్ చేయడానికే వర్మతో వైసీపీ రాజకీయం చేస్తుందని టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. మరి ఈ రచ్చ ఎంతవరకు వెళుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news