తన అన్నతో వివాదాలు ఉన్నాయని, అందుకే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టిందనే ప్రచారం మొన్నటి దాకా తెలంగాణ రాజకీయాల్లో షర్మిల గురించి వినపడ్డాయి. దీంతో ఆమె తెలంగాణ వాదే అని ఆంధ్రా ముంద్ర చెరిపేసుకోవాలని ఆమెకూడా తెగ ప్రయత్నాలు చేశారు. ఈ ప్రచారాన్ని ఒక అస్త్రంగా చేసుకోవాలని భావించింది షర్మిల.
ఇందులో భాగంగానే తన తండ్రి వైఎస్సార్ జయంతి రోజున జగన్, షర్మిల వేర్వేరుగా మొదటిసారి నివాళులు అర్పించడంతో ఈ ప్రచారానికి బలం పెరిగింది. కానీ ప్రతిపక్షాలు మాత్రం జగన్, షర్మిల మధ్య ఎలాంటి వివాదాలు లేవని వారిద్దరూ కలిసే నాటకాలు ఆడుతున్నారని విమర్శించాయి.
ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాత్రం అసలు జగన్ కు షర్మిలకు మధ్య ఎలాంటి వివాదాలు లేవని, అవన్నీ అబద్ధపు ప్రచారాలు అంటూ సంచలన కామెంట్లు చేశారు. అయితే ఈయన కామెంట్లు కాస్త షర్మిలకు షాక్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే షర్మిల, జగన్ ఒక్కటే అనే ముద్ర తెలంగాణ ప్రజల్లోకి వెళ్తే ఆమెకు అది మైనస్ అవుతుంది. మరి దీనిపై ఆమె ఏమైనా రియాక్ట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.