ఝార్ఖండ్ అసెంబ్లీ సీట్ల పంపకాల్లో తగ్గేదేలే అంటున్న ఆర్జేడీ.. కూటమిలో చీలికలు ఖాయమా..?

-

ఝార్ఖండ్ లో ఎన్నికల వేడి ప్రారంభమైంది.. సీట్ల పంపకాల్లో కూటమి పార్టీలు బిజీగా ఉన్నాయి.. కాంగ్రెస్, జేఎంఎంలు 70 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు సీఎం హేమంత్ సొరేన్ ప్రకటించారు.. దీనిపై మరో మిత్రపక్షం ఆర్జేడీ భగ్గుమంది.. 12 సీట్ల కంటే తక్కువ ఇస్తే ఒంటరిగా పోటీ చేస్తామని హెచ్చరించింది.. దీంతో ఇండియా కూటమిలో సీట్ల కుంపటి స్టాటైంది..

ఝార్ఖండ్ లో 81 అసెంబ్లీ సీట్లున్నాయి.. 70 సీట్లలో పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్, జేఎంఎం ప్రకటించాయి.. మిగిలిన 11 స్థానాలను ఆర్డేడీతో పాటు.. లెప్ట్ పార్టీలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.. దీనిపై ఆర్జేడీ ఘాటుగా స్పందించింది.. తమను సంప్రదించకుండానే సీట్ల కేటాయింపు ఎలా చేశారని ప్రశ్నిస్తోంది.. 12 సీట్ల కంటే తక్కువ ఇస్తే పోటీ చేస్తే ప్రసక్తే లేదని.. అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది.. 12 నుంచి 18 చోట్ల తాము బలంగా ఉన్నామని.. చెప్పుకోచ్చింది..

ఈ వ్యవహారంపై ఇండియా కూటమిలో రచ్చ మొదలైంది.. గత ఎన్నికల్లొ జేఎంఎం 43 స్థానాలు
కాంగ్రెస్ 31 స్థానాలు పోటీ చేశాయి.. అధికారాన్ని చేజిక్కించుకున్నాయి.. ఈ సారి రెండు కలిసి 70 స్థానాల్లో బరిలో దిగేందుకు సిద్దమవుతున్నాయి.. అయితే ఆర్జేడీ అసంతృప్తిని చల్లార్చేందుకు అగ్రనాయకత్వం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.. మరో పక్క ఎన్డీఏ కూటమి తమ సీట్లును ఖరారు చేసుకుని ప్రచారాలకు సిద్దమవుతోంది.. బిజేపీ 68, ఏజేఎస్ యూ 10, జేడీయూ 2, ఎల్జేపీ 1 ఒక్కో స్థానంలో పోటీ చెయ్యనున్నాయి.

ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరేలా బిజేపీ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది.. జేఎంఎంలో కీలక నేతలుగా ఉన్న మాజీ సీఎం చంపాయి సోరెన్, సీతాసోరెన్, సుదర్శన్ భగత్, గీతా కోడా లు ఈసారి బిజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు.. ఈ ధీమాతోనే తాము అధికారంలోకి వస్తామని కమలం పార్టీ కాన్ఫిడెంట్ గా చెబుతోంది.. కాగా నవంబర్ 13, నవంబర్ 20న రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.. ఝార్ఖండ్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news