హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం : టిఆర్ఎస్ ఎంపీటీసీ దంపతులు మృతి !

హైదరాబాద్ లో నిపెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో భార్య భర్తలు ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. వేణు గోపాల్ రెడ్డి, కవిత ఇద్దరు భార్య భర్తలు. నల్గొండ జిల్లా తిపర్తి మండలం దుప్పల పల్లి కి వేణు గోపాల్ రెడ్డి ఎంపీటీసీ. అంతే కాదు వేణు గోపాల్ రెడ్డి.. టిఆర్ఎస్ పార్టీ మండల స్థాయి నేత. అయితే.. గత నెల 22 వ తేదీన వాళ్ళ కూతురు వివాహం ఘనంగా చేశారు.

ఆ పెళ్లి వేడుకలు జరుపుకొని.. తిరిగి వనస్థలిపురం లోని సహారా స్టేట్స్  లోని తమ నివాసానికి కి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి పెద్ద అంబర్ పేట్ వద్ద కు రాగానే.. వీళ్ళ స్కార్పియో వాహనాన్ని టిప్పర్ లారీ ఢి కొట్టింది. దీంతో దంపతులు ఇద్దరూ అక్కడిక్కడే  మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం లో టిప్పర్ డ్రైవర్ తప్పిదమే ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ప్రస్తుతం టిప్పర్ డ్రైవర్ పరారీ లో ఉన్నాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.