సబితాకు లక్ తక్కువగా ఉందే!

రాజకీయాల్లో వలస నాయకులకు అన్నివేళలా కలిసిరాదు అనే చెప్పాలి. ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి జంప్ చేసే నేతలకు తాత్కాలికంగానే కలిసొస్తుంది తప్ప…ఉన్నంత కాలం ప్రజలు ఆదరించడం కష్టం. ప్రజల తీర్పుని కాదని వేరే పార్టీలోకి వెళితే ఏం అవుతుందో..2019 ఏపీ ఎన్నికలు రుజువు చేశాయి. 2014లో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ కొట్టారు. పైగా నలుగురు మంత్రులు కూడా అయ్యారు. ఇలా జంప్ కొట్టిన వారిలో ఒక్క గొట్టిపాటి రవికుమార్ తప్ప మిగిలిన వారంతా ఓటమి పాలయ్యారు.

sabitha indra reddy

అయితే తెలంగాణలో జంప్ చేసిన నేతలకు ఓటమి ఎదురవ్వలేదు. 2014లో టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వచ్చారు. 2018లో తెలంగాణ సెంటిమెంట్, కేసీఆర్ ఇమేజ్ తో వారు గెలిచేశారు. కానీ ఈ సారి కేసీఆర్ ఇమేజ్ తగ్గుతుంది..అలాగే తెలంగాణ సెంటిమెంట్ పదే పదే టీఆర్ఎస్ పార్టీకి యూజ్ అవ్వదు. కాబట్టి ఈ సారి జంపింగ్ ఎమ్మెల్యేలకు చుక్కలు కనబడేలా ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి 12, టీడీపీ నుంచి ఇద్దరు టీఆర్ఎస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఇలా జంప్ చేసిన ఎమ్మెల్యేల పరిస్తితి ఈ సారి అంత ఆశాజనకంగా లేదు..ఇటీవల వస్తున్న సర్వేల్లో జంపింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ఓటమి ఎదురవ్వడం ఖాయమని తేలింది. ఇదే క్రమంలో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చి మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి పరిస్తితి కూడా అంతే అని సర్వేలు చెబుతున్నాయి. ఈ సారి మహేశ్వరంలో సబితా గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది.

ఇటీవల వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తేలింది. దీని బట్టి చూస్తే సబితాకు మహేశ్వరంలో రిస్క్ ఎక్కువగానే ఉంది. పైగా టీఆర్ఎస్ లో వర్గపోరు ఉంది. ఎటు చూసిన సబితాకు గెలుపు అవకాశాలు మెరుగ్గా కనబడటం లేదు.