రాబోయే ఎన్నికల్లో మరొకసారి గెలిచి అధికారం చేపట్టాలని జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. తాను అమలు చేస్తున్న సంక్షేమ పాతజలు మళ్ళీ గట్టెక్కిస్తాయని భావిస్తున్నారు. అయితే పథకాలతోనే వైసీపీ మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంది. పైగా ప్రతిపక్షాల పొత్తులో కన్ఫ్యూజన్..ఒకవేళ టిడిపి-జనసేన-బిజేపి కలిస్తే వైసీపీకే అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో గెలిచే ఛాన్స్ ఉంది. పొత్తు లేకపోయినా వైసీపీకే ప్లస్.
ఇక ఎటు చూసుకున్న మరోసారి అధికారంలోకి రావడం అనేది జగన్‌కు సులువు అనే చెప్పాలి. కాకపోతే గత ఎన్నికల్లో వచ్చినట్లుగా వన్‌సైడ్ గా ఫలితాలు రావడం కష్టం. టిడిపి-జనసేన కాంబినేషన్ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయినా సరే ఆధిక్యం వైసీపీకే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పొత్తు ఉన్నా సరే టిడిపి-జనసేనల మధ్య ఓట్లు బదిలీ సులువు కాదు. కాబట్టి వైసీపీకే బెనిఫిట్. అదే సమయంలో జగన్‌ని అధికారంలోకి తెచ్చేవి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలే అని చెప్పవచ్చు.
ఎలాగో సీమలో టిడిపి బలం తక్కువ. అసలు జనసేనకు అడ్రెస్ లేదు. ఇక్కడ ఉండే 52 సీట్లలో..వైసీపీకి 40 సీట్లు వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అటు ఉత్తరాంధ్రలో 34 సీట్లు ఉన్నాయి…వీటిల్లో 20 సీట్లు ఈజీగా గెలుచుకుంటుందని తెలుస్తుంది. అంటే ఇక్కడే 60 సీట్లు వచేస్తాయి. ఇక మ్యాజిక్ ఫిగర్ 88..అంటే 28 సీట్లు రావాలి. అందులో నెల్లూరు-ప్రకాశంలో 22 సీట్లు ఉన్నాయి..వాటిల్లో 12 సీట్లు సులువే. ఇక గుంటూరు-కృష్ణా-పశ్చిమ-తూర్పు గోదావరి జిల్లాల్లో 20 సీట్లు గెలిచిన చాలు..మళ్ళీ వైసీపీదే అధికారం. కాబట్టి బలమైన సీమలో మెజారిటీ సీట్లు సాధించడమే వైసీపీ టార్గెట్.
ఇటు విశాఖ రాజధాని ప్రభావంతో ఉత్తరాంధ్రలో కూడా సత్తా చాటనుంది. మొత్తానికి సీమ, ఉత్తరాంధ్ర వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.