చంద్రబాబు లాంటోడు బయట తిరగొద్దంట!

-

మామూలుగా చేసే రాజకీయ విమర్శలు ఒకెత్తు అయితే… చంద్రబాబు, లోకేష్ ల పేర్లు చెబితే వైకాపా నేతల్లో కొందరు చేసే విమర్శలు మరొకెత్తు. వారిలో మరి ముఖ్యంగా రోజా చేసే విమర్శలు ఇంకోకెత్తు. ఏమాత్రం తడబడకుండా, తత్తరపాటు లేకుండా… చంద్రబాబు పేరు చెప్పడం ఆలస్యం, తనదైన లాజిక్కులు లాగేసి విమర్శలు చేస్తుంటారు రోజా. తాజాగా అచ్చెన్నాయుడు అరెస్టు విషయాలపై స్పందించిన రోజా… ఆ క్రమంలో చంద్రబాబుపై ఫైరయ్యారు. బాబులాంటోడు బయట తిరగడం మంచిది కాదంటూ తేల్చేశారు!

వివరాళ్లోకి వెళ్తే… తాజాగా అచ్చెన్నాయుడు అరెస్ట్‌ పై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. తప్పు చేశారని రుజువైంది కాబట్టే అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని, టీడీపీ నేతలు చెబుతున్నంతగా అచ్చెన్నాయుడు ఏమీ పెద్ద స్పోక్స్ పర్సన్ కాదని, అసెంబ్లీలో సబ్జెక్ట్ పై మాట్లాడటం రాకపోయినా, అడ్డగోలు అరుపులతో నెట్టుకొస్తుంటాడని ఆమె అన్నారు! అచ్చెన్నాయుడ్నికి ఆధారాలతో అరెస్ట్ చేస్తే కిడ్నాప్ చేశారని చంద్రబాబు అంటున్నారని.. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదని విమర్శించారు. తాము ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదన్న రోజా.. తమ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగితే నిరూపించాలని గతంలోనే లోకేష్ ఓ ప్రెస్ మీట్‌లో చెప్పారు. ఇప్పుడు అదే నిరూపిస్తున్నామని.. అచ్చెన్నాయుడు అరెస్ట్ కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుందని రోజా తెలిపారు. తప్పు చేసిన వ్యక్తి బీసీ అయినా, ఓసీ అయినా, ఎస్సీ అయినా.. ఎవరైనా కూడా తప్పకుండా జైలుకు పంపిస్తామని ఎమ్మెల్యే రోజా వెల్లడించారు.

ఈ క్రమంలో బాబు ప్రస్థావన తెచ్చిన రోజా… అచ్చెన్నాయుడు బీసీ నాయకుడు కాబట్టి అరెస్టు చేశారని విమర్శిస్తున్నాడు… అందుకు ఎస్సీ మహిళ అయిన హోం మంత్రి రాజినామా చేయాలని ఎలా డిమాండ్ చేస్తాడు. చంద్రబాబుకే అర్ధం కావాలి తన మానసిక పరిస్థితి ఏమిటనేది… ఇలాంటి వాడు బయట తిరిగే గనక ప్రజలకు చాలా అపాయం కాబట్టి కచ్చితంగా ఇతన్ని మెంటల్ హాస్పటల్ కి పంపించాలని రోజా అన్నారు!

Read more RELATED
Recommended to you

Latest news