ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దెబ్బకు ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. అవినీతి చేస్తున్న అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. ఒక్క శుక్రవారమే అవినీతి అధికారుల మీద దాడులు చేసారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏకకాలంలో తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తుంది.
తహసీల్దార్ కార్యాలయాల్లో రికార్డులను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట, వడమాల, పుత్తూరు, నగరి తహసీల్దార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. అదే విధంగా… నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, కావలి, ముదిగుప్ప, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ సోదాలు చేసారు అధికారులు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో కూడా చేసారు.
కర్నూలు జిల్లా కల్లూరు, ప్రకాశం జిల్లా పొన్నలూరు కార్యాలయాలతో పాటుగా విశాఖ జిల్లాలోని సబ్బవరం, భీమిలి, తూ.గో జిల్లా పెద్దాపురం, కడప జిల్లాలో బ్రహ్మంగారిమఠ౦, విజయనగరం జిల్లా వేపాడు తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు చేస్తుంది. అధికారులు రావడాన్ని గమనించిన పలు కార్యాలయాన్ని విఆర్వోలో పరారయ్యారు. ఇప్పటికే ఏసీబీ అధికారులకు జగన్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.