షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి సీఎం కేసీఆర్‌పై మండి పడుతున్నారు. ప్రతి దాన్ని రాజకీయం చేస్తూ కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఆమె కేవలం ప్రధానంగా కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు తప్ప.. మంత్రులను, ఎమ్మెల్యేల జోలికి పోవట్లేదు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఆమె కేసీఆర్‌పై బాణం ఎక్కుపెట్టింది. ఈ సారి కూడా ట్విట్టర్‌లోనే విమర్శలు సంధించింది. కేసీఆర్‌కు కరోనా వస్తే యశోద ఆస్పత్రికి వెళ్లాడని, కానీ పబ్లిసిటీ కోసం గాంధీకి, ఎంజీఎం ఆస్పత్రులకు వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని తాను ఎన్ని సార్లు కోరినా కేసీఆర్ పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఈమె విమర్శలను గానీ ఆరోపణలను గానీ టీఆర్ ఎస్ నేతలు అస్సలు పట్టించుకోవట్లేదు. కనీసం కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా ఆమెను లెక్కలోని తీసుకోవట్లేదు. ఒకవేళ ఆమె మాటలపై స్పందిస్తే ఆమెకు పబ్లిసిటీ వస్తుందని టీఆర్ ఎస్ భావిస్తుందని తెలుస్తుంది. ఆమెకు ఒకసారి పట్టు దొరికితే టీఆర్ ఎస్‌కు మరో ప్రత్యర్థిగా తయారవుతుందని కేసీఆర్ టీమ్ భావిస్తుంది.