కృష్ణా జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీని వీడుతున్న ఆ సామాజిక వర్గం..!

-

వీరంతా టీడీపీని వీడేసరికి.. కృష్ణా జిల్లాలో టీడీపీ సగం ఖాళీ అయిపోయింది. అంతే కాదు.. మంత్రి దేవినేని సొంత సోదరుడు చంద్రశేఖర్ ప్రసాద్ కూడా ఇటీవలే వైఎస్సార్సీపీలో చేరారు.

ఆ సామాజిక వర్గం కృష్ణా జిల్లా రాజకీయాలనే మార్చేయగలదు. బలమైన వర్గం. జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగలదు. ఇప్పుడు అదే జరిగింది. టీడీపీ నుంచి ఆ సామాజిక వర్గం నేతలు వైఎస్సార్సీపీలోకి క్యూ కడుతున్నారు.


సీనియర్ నాయకుడు వసంత నాగేశ్వరరావు, ఆయన కొడుకు కృష్ణ ప్రసాద్, ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జైరమేశ్, ఆయన సోదరుడు దాసరి బాలవర్ధన్ రావు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి.. వీరంతా ఇటీవలే వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి విజయవాడ, గన్నవరంలో మాంచి పట్టు ఉంది. వీరి వెంటే ప్రజలు ఉంటారు. వీరంతా టీడీపీని వీడేసరికి.. కృష్ణా జిల్లాలో టీడీపీ సగం ఖాళీ అయిపోయింది. అంతే కాదు.. మంత్రి దేవినేని సొంత సోదరుడు చంద్రశేఖర్ ప్రసాద్ కూడా ఇటీవలే వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో టీడీపీకి కృష్ణా జిల్లాలో దెబ్బల మీద దెబ్బలు పడుతున్నాయి.మరోవైపు విజయవాడ ఎంపీగా వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేస్తున్న ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ పొట్లూరి వరప్రసాద్ కు ఆ ప్రాంత ప్రజలతో విస్తృత సంబంధాలున్నాయి. అవనిగడ్డలోనూ రాజకీయాలు మారిపోయాయి.



రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేశ్ నాయుడు వైసీపీలో చేరారు. దీంతో అవనిగడ్డలోనూ టీడీపీకి షాక్ తగిలింది. పామర్రు మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ కూడా నిన్న జగన్ సమక్షంలో వైసీపీలో చేరడంతో కృష్ణా జిల్లాలో టీడీపీ ఖేల్ ఖతమయినట్టే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version