ఏది అయినా చేయి తెలంగాణాలో బిజెపి జెండా ఎగరాలి. ఎగారాల్సిందే… ఇప్పుడు బిజెపి అధిష్టానం గాని, తెలంగాణా బిజెపి అగ్ర నాయకులు గాని ఆలోచించేది దాని గురించే. హిందు ఓటు బ్యాంకు ఉంది. ఆ ఓటు బ్యాంకు ని కాపాడుకుంటూ, తమ వైపు చూడని హిందువులను తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తూ, కొత్త ఓటు బ్యాంకు ని సృష్టించుకోవడం, సమర్ధవంతమైన నాయకత్వాన్ని తయారు చేయడం వంటివి చెయ్యాలని భావిస్తున్నారు.
అది ఎంత వరకు ఫలిస్తుందో తెలియదు గాని బీజీపీ మాత్రం ఇప్పుడు సరికొత్త ఆలోచనలు చేస్తుంది. ఆదరణ లేని, బలం ఉన్న నేతలను తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని పార్టీలోకి తీసుకునే ఆలోచనలో ఉంది బిజెపి అధిష్టానం. ఇప్పటికే ఆయనతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సంప్రదింపులు జరిపారని సమాచారం.
ఆయన్ను పార్టీలోకి తీసుకుని రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పినట్టు సమాచారం, కర్ణాటక నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపించే యోచన బీజీపీ అధిష్టానం చేస్తుంది. అదే విషయాన్ని చెప్పారు కిషన్ రెడ్డి. తుమ్మల వస్తే నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఆయన వర్గం ఉంది. ఆ వర్గం మొత్తం బిజెపిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా హైదరాబాద్ లో కూడా ఆయనకు సన్నిహితంగా కొందరు నేతలు ఉన్నారు.
సుధీర్గ కాలం మంత్రిగా చేసిన అనుభవం ఉన్న నేత కావడంతో ఆయనకు పరిచయాలు కూడా ఉన్నాయి. అటు కాంగ్రెస్ లో కూడా ఆయన సన్నిహితులు ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో కూడా ఆయనకు గుర్తింపు ఉంది. ఇప్పుడు త్వరలో తుమ్మల ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉందని, ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం. వాస్తవానికి అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడే భేటి అవ్వాలని భావించారట.