కేశినేనికి చెక్ పెట్టాలంటే జై ర‌మేశ్ రావాల్సిందేనా?

ఏపీలో ఇప్పుడు వైసీపికి ఉన్న బ‌లం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఊహ‌కు కూడా అంద‌ని మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చింది. అయితే టీడీపీ ఆ ఘోర ఓట‌మి నుంచి ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతోంది. కానీ వైసీపికి కూడా విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స్థానంలో స‌రైన నాయ‌కుడు లేడ‌నే చెప్పాలి. ఇక్క‌డ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో రెండుసార్లు వైసీపీ ఓడిపోతూనే వ‌స్తోంది.

 

Kesineni Nani Shock To Chandrababu

వ‌రుస‌గా రెండుసార్లు టీడీపీ తరుపున కేశినేని విజయ ఢంకా మోగిస్తూ వ‌చ్చారు. కాగా వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ ఘోర ఓట‌మి పాల‌య్యారు. ఇక అప్ప‌టి నుంచి ఆయ‌న విజయవాడ రాజకీయాల్లో పెద్ద‌గా క‌నిపించ‌ట్లేదు. మ‌రి ఇప్పుడు నానికి చెక్ పెట్టాలంటే దాస‌రి జై ర‌మేశ్ అయితేనే ప‌క్కా అని కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు.

వైసీపీ అసెంబ్లీ స్థానాల్లో బ‌లంగా ఉన్నా.. పార్ల‌మెంట్ కు వ‌చ్చే సరికి కేశినేని బ‌లంగా క‌నిపిస్తున్నారు. అయితే ఈయ‌న‌కు చెక్ పెట్టాలంటే జై ర‌మేశ్ అయితేనే ప‌క్కాఅని జ‌గ‌న్ కూడా యోచిస్తున్నారంట‌. గతంలో దాసరి జై ర‌మేశ్ టీడీపీ నుంచి ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు. దాంతో ఆయ‌న గ‌త ఎన్నిక‌ల‌కు ముందు తన సోదరుడు బాలవర్ధన్ రావుతో పాటు వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. అప్పుడు టికెట్ వ‌స్తుంద‌ని భావించినా.. ద‌క్క‌లేదు. కానీ ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఆయ‌న్ను అన్ని కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామ్యం చేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారంట‌.